
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లికి రెడీ అయ్యారు. తన వ్యక్తిగత జీవితంలో మరో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. 61 ఏళ్ల వయసులో, తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. వివాహం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
సింపుల్‌గా.. కానీ స్పెషల్‌గా!
ఆమిర్ పెళ్లి అంటే భారీ సెట్టింగులు, స్టార్‌డమ్ హంగామా ఉంటుందని అందరూ ఊహించారు. కానీ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకోబుతున్నట్లు మిస్టర్ పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చారు. జూలై 5న ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. గతంలోనే తాను జీవితంలో ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆమిర్ చెప్పిన మాట ఇప్పుడు నిజం కాబోతోంది. ఎట్టకేలకు ఈ జంట ఒక్కటి కాబోతున్నారు.
మాజీతో స్నేహపూర్వకంగానే…
రీనా దత్తా, కిరణ్ రావుతో విడిపోయినప్పటికీ, వారితో ఆమిర్ ఇప్పటికీ స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగిస్తున్నారు. ఇటీవలే తన ఇద్దరు మాజీ భార్యలు , గౌరీ స్ప్రాట్‌తో కలిసి ‘లగాన్’ మూవీ సిల్వర్ జూబ్లీ వేడుకలు పాల్గొన్నారు . ఈ ఈవెంట్ కాస్తా అమీర్ ఖాన్ ఫ్యామిలీ రీయూనియన్‌గా మారిపోయింది. ఈ వేడుక ముగిసిన తర్వాత అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలు, కాబోయే భార్యతో కలిసి ఒకే కారులో ఇంటికి వెళ్లారు.
క్రేజీ ప్రాజెక్టుతో..
పెళ్లి తర్వాత అమీర్ ఖాన్.. ‘3 ఇడియట్స్ 2’ (3 Idiots 2) షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. రణచో దాస్‌గా మళ్ళీ ఆయనను తెరపై చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. దీనితో పాటు అష్నీర్ గ్రోవర్ బయోపిక్, గత ఏడాది విడుదలైన ‘సితారే జమీన్ పర్’ విజయంతో ఆయన ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. మొత్తానికి, పర్సనల్ లైఫ్‌లో కొత్త బంధాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌లో క్రేజీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తూ ఆమిర్ ఖాన్ మళ్ళీ డబుల్ ధమాకాకు రెడీ అవుతున్నారు. ఈ కొత్త ప్రయాణం ఆమిర్ జీవితంలో మరిన్ని సంతోషాలను నింపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.