
విజయవాడ కృష్ణలంకలో సాయికృష్ణ లాకప్ డెత్ ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పోలీసులు, ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్ష వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి సర్కార్ సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ పై పవన్ కళ్యాణ్ నోరు విప్పాలని అన్నారు.
సాయి కృష్ణ లాక్ డెత్ ఘటన పై సిబిఐ విచారణ జరిపించాలని.. ఒక తల్లికి జరిగిన అన్యాయంపై ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తోందని.. అనంతపురం జిల్లాలో ఒక దళిత మహిళ తల్లి లాకప్ డెత్ ఘటన తరువాత ఇలాంటి ఘటనలు ఎన్నో చోట్ల జరిగాయని మండిపడ్డారు భూమన.
ALSO READ : తెలంగాణలో 5లక్షల డూప్లికేట్ ఓట్లు
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న దారుణాలపై సిఐ ఒకరే బాధ్యుడు కాదు,వెనుక ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని… హోంమంత్రి అనిత పదవికి రాజీనామా చేయాలని అన్నారు. సాయికృష్ణ శవాన్ని తీసుకెళ్లి అనాధ శవంగా కాల్చివేసి అత్యంత దారుణంగా పాసవికంగా పోలీసులు వ్యవహరించారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు.