Reading Time: < 1 minute
Two Passenger Trains Collide Near London Two Dead Over 80 Injured In Major Rail Accident

శుక్రవారం సాయంత్రం బ్రిటన్‌లోని Bedford సమీపంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, సుమారు 80 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఒక లోకో పైలట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైలు ట్రాకింగ్ సమాచారం ప్రకారం, రెండు రైళ్లు St Pancras International వైపు దక్షిణ దిశలో ప్రయాణిస్తుండగా సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి.

భారీ సహాయక చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు, ఎయిర్ అంబులెన్స్, ప్రత్యేక ప్రమాద స్పందన బృందాలు, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ప్రయాణికుల భయానక అనుభవం

రైలులో ప్రయాణిస్తున్న పీటర్ నాప్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా నేను ముందున్న సీటుపైకి ఎగిరిపడ్డాను. పొగ కనిపించింది. ప్రజలు ఏడుస్తూ, అరుస్తూ కనిపించారు. చాలా మంది భయంతో, అయోమయంలో ఉన్నారని తెలిపాడు. చాలా మంది ప్రయాణికులు కాళ్లు విరగడం, తీవ్ర రక్తస్రావ గాయాలపాలయ్యారని తెలిపాడు

రైలు సర్వీసులపై ప్రభావం

East Midlands Railway తెలిపిన వివరాల ప్రకారం.. కార్బీ నుంచి లండన్ వెళ్తున్న 4:40 సర్వీస్.. నాటింగ్‌హామ్ నుంచి లండన్ వెళ్తున్న 3:50 సర్వీస్ ఢీకొన్నాయి. దీంతో లండన్ సెయింట్ పాన్‌క్రాస్‌కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు.