
భారత్‌లో స్టాండ్ అప్ కమెడియన్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. తిరుగులేని రారాజులుగా ఎదుగుతూ, సంపాదనా పరంగా మిగిలిన వారిని వెనక్కి నెట్టేస్తున్నారు. బ్రాండ్ విలువను అమాంతం పెంచుతున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న నమ్మశక్యం కాని లెక్కలు షాకిస్తున్నాయి. స్టాండ్ అప్ కమెడియన్ సమయ్ రైనా ప్రస్తుతం టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక బ్రాండెడ్ ఇన్‌స్టా రీల్ కోసం 70 నుంచి రూ. 80 లక్షలు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్న సమయ్ రైనా బ్రాండ్ రేట్లు పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేయడానికి 20 లక్షలు ఒక సాధారణ స్టాటిక్ పోస్ట్ కు రూ. 25 నుంచి రూ. 35 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది . ‘స్టిల్ అలైవ్’ అనే స్టాండ్-అప్ స్పెషల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది చిన్నతనంలో బుల్లీయింగ్, కశ్మీరీ పండిట్ గుర్తింపు, మానసిక ఆరోగ్యం తన కెరీర్‌లో ఎదుర్కొన్న అతిపెద్ద వివాదాలను సమయ్ అందులో చర్చించారు. ఆ వీడియోకు యూట్యూబ్‌లో 63 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒకే అప్‌లోడ్‌పై వచ్చిన వ్యూస్ ఆధారంగా, ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన ఫుల్-లెంగ్త్ స్టాండ్-అప్ కామెడీ స్పెషల్‌గా అది రికార్డు సృష్టించింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ వివాదం తర్వాత కూడా ప్రేక్షకులు అతన్ని ఎంతగా ఆదరిస్తున్నారో ఈ విజయం నిరూపించింది. మరోవైపు, ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లు కూడా గట్టిగానే సంపాదిస్తున్నారు. మరాఠీ కమెడియన్ ప్రణిత్ మోరే అత్యధికంగా సంపాదిస్తున్నారు. ఇటీవల ‘రూ.370 బిరియాని’ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల ఫాలోవర్లు ఉన్న మోరే, ఒక స్టోరీకి రూ. 2.5 లక్షలు, స్టాటిక్ పోస్ట్‌కు రూ. 4 నుంచి 5 లక్షలు, ఒక బ్రాండెడ్ రీల్ కోసం రూ. 13 నుంచి 14 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అభిషేక్ ఉపమన్యు కూడా బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్‌లో టాప్ రేట్లు అందుకుంటున్నారు. గడిచిన ఐదేళ్లలో స్టాండ్ అప్ కామెడీ బిజినెస్‌లో ఊహించని మార్పులొచ్చాయి. చిన్న క్లబ్ పెర్ఫార్మెన్స్‌ల నుంచి పెద్ద ఎరీనా షోల వేదికా లైవ్ కామెడీ షోలను చూడటానికి యువత భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. దాంతో కమెడియన్లు సంపాదన కోసం కేవలం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపైనే ఆధారపడటం తగ్గింది. అమెరికా, యూరప్ లోని భారతీయ సంతతి ప్రేక్షకుల ఆదరణ కారణంగా గ్లోబల్ టూర్లు వీరికి మరిన్ని లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!
Maa Inti Bangaram: రఫ్ఫాడించిన సమంత! హిట్టా..? ఫట్టా..?
Peddi: OTTలోకి ‘పెద్ది’ వచ్చేది.. ఎప్పుడంటే..?
Save The Tigers 3: మొగుళ్ల ఫ్రస్ట్రేషన్.. నవ్వుల జాతర! హిట్టా..? ఫట్టా..?