Reading Time: 2 minutes
Indian Railways Announces 9 Special Trains For Neet Candidates On June 21

Special Trains for NEET Candidates: నీట్ పరీక్షకు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూడటానికి తూర్పు మధ్య రైల్వే జూన్ 21న తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైళ్ల మార్గాలు, టైమ్‌టేబుళ్లను కూడా విడుదల చేసింది. నీట్ పరీక్ష రోజున విద్యార్థులు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం, పరీక్షా కేంద్రాలకు ఆలస్యం కాకుండా చేరుకోవడం కోసం ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తూర్పు మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సరస్వతి చంద్ర తెలిపారు. ఇందుకోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఈ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

నీట్‌ పరీక్ష నిర్వహించే రోజు అనగా జూన్ 21 ఆదివారం రోజు పాట్నా-దర్భంగా, పాట్నా-గయా, దానాపూర్-ఝఝా, ఝఝా-దానాపూర్, పాట్నా-బక్సర్, బక్సర్-పాట్నా, వారణాసి-పాట్నా, రాంచీ-డాల్తోన్‌గంజ్, రాంచీ-ధన్‌బాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ మార్గాల్లో పెద్ద సంఖ్యలో నీట్ అభ్యర్థులు ప్రయాణించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.

రైళ్ల పూర్తి షెడ్యూల్ విడుదల

రైలు నెం. 08603 రాంచీ-ధన్‌బాద్ సాయంత్రం 6:30 గంటలకు, 08631 రాంచీ-డాల్తోన్‌గంజ్ రాత్రి 7:15 గంటలకు బయలుదేరుతుంది. 04208 వారణాసి-పాట్నా రైలు సాయంత్రం 5:45 గంటలకు నడుస్తుంది. అలాగే పాట్నా, బక్సర్, గయా, దానాపూర్, ఝఝా, దర్భంగా మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేశారు.

ప్రయాణికులకు రైల్వే విజ్ఞప్తి

ప్రయాణ సమయంలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో సహకరించాలని రైల్వే శాఖ ప్రయాణికులకు సూచించింది. ఎవరైనా రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. పరీక్ష రోజున రైళ్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

9 ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్‌

* రైలు నెం. 08603: రాంచీ నుండి ధన్‌బాద్, బయలుదేరే సమయం సాయంత్రం 6:30.
* రైలు నెం. 08631: రాంచీ నుండి డాల్తోన్‌గంజ్, బయలుదేరే సమయం రాత్రి 7:15.
* రైలు నెం. 04208: వారణాసి నుండి పాట్నాకు, బయలుదేరే సమయం సాయంత్రం 5:45.
* రైలు నెం. 03212: బక్సర్ నుండి పాట్నా, బయలుదేరే సమయం ఉదయం 6:30.
* రైలు నెం. 03213: పాట్నా నుండి బక్సర్, బయలుదేరే సమయం సాయంత్రం 6:20.
* రైలు నెం. 03214: ఝఝా నుండి దానాపూర్, బయలుదేరే సమయం 3:40 AM.
* రైలు నెం. 03215: దానాపూర్ నుండి ఝఝా, బయలుదేరే సమయం 6:15 PM.
* రైలు నెం. 03216: పాట్నా నుండి గయ, బయలుదేరే సమయం ఉదయం 6:00 గంటలు.
* రైలు నెం. 03211: పాట్నా నుండి దర్భంగా, బయలుదేరే సమయం ఉదయం 4:30 గంటలకు.. అయితే, పరీక్ష రోజున రైళ్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని రైల్వే అధికారులు చెబుతున్నారు.