
హైదరాబాద్ లోని బడంగ్ పేట్ లో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని పదార్థం పేలి.. కార్మికుడు మృతి చెందాడు. ఆదివారం ( జూన్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బడంగ్‌పేట్ ప్రాంతంలో గుర్తుతెలియని పదార్థం పేలడంతో కార్మికుడు అనూప్ ప్రధాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు మూడు రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నుంచి డెకరేషన్ గోదాం పని చేసేందుకు బడంగ్‌పేట్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో మృతుడు చెత్త కుప్ప సమీపంలో ఉండగా, అందులో ఉన్న గుర్తుతెలియని పదార్థం ఒక్కసారిగా పేలింది.
పేలుడు తీవ్రతకు మృతుడి చేతులు, కాళ్లు తునాతునకలై శరీర భాగాలు సుమారు 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.