Reading Time: 2 minutes

వాట్సాప్ ఇక ఫ్రీ కాదా..? డబ్బులు కట్టాల్సిందేనా..? వాట్సాప్ ప్లస్ వచ్చేసింది.. నెలకు 79 రూపాయలు !

Caption of Image.

వాట్సాప్ ఇప్పటివరకూ పూర్తి ఉచితంగా సేవలందించే యాప్గా మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి.. ఇండియాలో వాట్సాప్ ప్లస్ అనే సబ్‌స్క్రిప్షన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ప్లస్ సబ్ స్క్రిప్షన్ సేవలు పొందాలనుకునే వినియోగదారులు నెలకు 79 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఈ ప్లాన్ మొదటి నెల పూర్తి ఉచితంగా లభిస్తుంది. నచ్చితేనే వాట్సాప్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ప్లస్ వల్ల ఎలాంటి బీభత్సమైన మార్పులేమీ లేవు. ఇది ఒక కస్టమైజేషన్ ప్యాక్ మాత్రమే. కాలింగ్, స్టేటస్, మెసేజింగ్, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ లాంటి ఫీచర్లు యథాతథంగా ఇందులోనూ ఉంటాయి. వినియోగదారులందరికీ ఎప్పటిలానే ఉచితంగానే లభిస్తాయి. ఈ వాట్సాప్ ప్లస్ వల్ల కొత్తగా వచ్చే బెన్ఫిట్స్ ఏంటంటే.. యాప్ ఐకాన్ ను మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. 14 రకాల కొత్త డిజైన్లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ఏదైనా ఎంచుకుని వాట్సాప్ను కొత్తగా కనిపించేలా మార్చుకోవచ్చు.

రెగ్యులర్ వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులో లేని స్పెషల్ రింగ్ టోన్స్, కొత్త స్టిక్కర్ ప్యాక్లు ఈ వాట్సాప్ ప్లస్లో పొందొచ్చు. చాట్ లిస్ట్కు 20 చాట్స్ వరకూ పిన్ చేసుకోవచ్చు. అయితే.. ఈ వాట్సాప్ ప్లస్ ఆప్షన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ ప్లస్ ఆప్షన్ కనిపించకపోతే.. అది ఇంకా మీ వాట్సాప్ అకౌంట్లో అందుబాటులోకి లేదని అర్థం. వాట్సాప్ ప్లస్ ఆప్షన్ కోసం వేచి చూడాలని అర్థం.

వాట్సాప్ ప్లస్ నెలకు 79 రూపాయలు చెల్లించి తీసుకోవాలో.. లేదో.. పూర్తిగా వినియోగదారుడి ఇష్టం. వాట్సాప్ను కేవలం మెసేజింగ్ కోసం మాత్రమే వాడుతూ ఉంటే.. వాట్సాప్ లుక్, ఫీచర్లు సరిపోతాయనుకుంటే.. ఈ వాట్సాప్ ప్లస్ ప్లాన్ అవసరం లేదు. వాట్సాప్ను కూడా కొత్తగా వాడాలనుకునే ఉత్సాహవంతులు ఈ వాట్సాప్ ప్లస్ ప్లాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు.

©️ VIL Media Pvt Ltd.