Reading Time: < 1 minute

మా సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకోం.. పవన్ కల్యాణ్‎పై కవిత హాట్ కామెంట్స్

Caption of Image.

హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‎పై టీఆర్ఎస్ చీఫ్ కవిత హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి సంతోషిస్తాం.. కానీ ఆయన మా సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకోమని అన్నారు. పవన్ కల్యాణ్ ఏపీకి ఉపముఖ్యమంత్రి.. ఆయనకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. అక్కడ రాజకీయాలు చేసుకోండి.. ఇక్కడ సినిమాలు తీసుకోండని సూచించారు. గతంలో మన భాషను వెక్కిరించి రాష్ట్రాన్ని కబ్జా చేశారని విమర్శించారు. 

సినిమాల పరంగా పవన్ కల్యాణ్ ఓకే.. కానీ అతడు రాజకీయాల్లో అన్ఫిట్ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి ఎంజాయ్ చేద్దామన్నారు. శనివారం (జూన్ 20) కవిత వరంగల్ జిల్లాలో పర్యటించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక్క విద్యా సంస్థ వరంగల్‎కు రాలేదన్నారు. 

విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనలో ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క జిల్లాను ఆరు ముక్కలు చేశారని మండిపడ్డారు. కీలకమైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‎కు కమిషనర్ లేరన్నారు. కాంగ్రెస్ తీరుతో రాష్ట్రం ఎందుకు సాధించుకున్నామని ప్రజల్లో మళ్లీ ఆలోచన వస్తోందని అన్నారు. కాంగ్రెస్ నేతలు మార్కెట్లకు వెళ్తే రైతులు తన్ని తరిమేస్తారు.

ఒక్క నాయకునికైనా మార్కెట్‏లకు వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంజీఎం ఆస్పత్రిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే నియంత హిట్లర్‎లా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఇసుక దోపిడీ సీఎం కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపించారు. మంత్రులు పొంగులేటి, సీతక్క కలిసి ఇసుక దోపిడీ చేస్తున్నారని అన్నారు. గోదావరి గర్భశోకానికి గురయ్యేలా చేస్తున్నారు. ఈ ఇసుక దోపిడీపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

 

©️ VIL Media Pvt Ltd.