
నేరడిగొండ (ఇచ్చోడ), వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చెప్పారు.
ఇచ్చోడ మండల కేంద్రంలోని కేజీబీవీలో రూ.88.55 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు శుక్రవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో రాణించాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, పాల్గొన్నారు.