
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు మలినేని గోపీచంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK111’. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్యకి జోడీగా మరో టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఇవాళ జూన్ 19న కాజల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్..“అందరూ అభిమానించే గొప్ప నటిగా మాత్రమే కాదు, అద్భుతమైన వ్యక్తిగా కూడా మిమ్మల్ని దగ్గరగా తెలుసుకునే అవకాశం లభించింది. #NBK111కు హృదయం, బలం, ఆత్మను తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. జన్మదిన శుభాకాంక్షలు కాజల్ అగర్వాల్ గారు” అంటూ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు.
Happy Birthday dearest @MsKajalAggarwal garu 🤗🤗
Beyond the performer everyone admires, i have had the privilege of knowing the wonderful person behind it all.
Thank you for bringing heart, strength and soul to #NBK111. pic.twitter.com/xikOPFwSXj
— Gopichandh Malineni (@megopichand) June 19, 2026
ఇప్పటికే బాలకృష్ణతో కలిసి చేసిన భగవంత్ కేసరి హిట్ కావడంతో, అదే సెంటిమెంట్ కొనసాగించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే, రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని, మూడో షెడ్యూల్తో బిజీగా ఉంది.
నయనతార ఎందుకు తప్పుకుంది?
ముందుగా ఈ చిత్రాన్ని ఒక భారీ హిస్టారికల్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు దర్శకుడు మలినేని గోపీచంద్. ఈ హిస్టారికల్ నేపథ్యంలో బాలయ్య సరసన రాణి పాత్ర కోసం నయనతారను ఎంపిక చేశారు. ఈ సినిమాకు సంబంధించిన నయనతార పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే స్క్రిప్టు మార్పులు, కాల్ షీట్ సమస్యల వల్లే ఈ సినిమా నుండి నయనతార తప్పుకున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు, ఈ సినిమా కోసం నయనతార దాదాపు రూ. 8 నుండి 10 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్‌లో పూర్తి చేయాలని మేకర్స్ భావించినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే అంత పెద్ద మొత్తం నయనతారకు ఇచ్చే బదులు, రూ.2 కోట్లలోపు వచ్చే మరో హీరోయిన్‌ను తీసుకోవాలని డిసైడ్ అయ్యి.. కాజల్ని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల సమాచారం.
The Queen enters the Empire 👸🏼
world of #NBK111
GOD OF MASSES #NandamuriBalaKrishn pic.twitter.com/7xxBR6BGyh— Nayanthara✨ (@NayantharaU) November 18, 2025
NBK111 గ్లింప్స్ విధ్వంసం!
ఇటీవలే బాలయ్య బర్త్ డే సందర్భంగా NBK111 యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ విడుదలై ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టే, బాలకృష్ణను మునుపెన్నడూ చూడని ఒక మోస్ట్ స్టైలిష్, పవర్‌ఫుల్ అవతార్‌లో గోపీచంద్ ప్రెజెంట్ చేశారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్లో మెరవనుంది. మంచు మనోజ్ విలన్గా నటిస్తున్నాడు.