
- మియాపూర్, కొండాపూర్‌లోని 2 రెస్టారెంట్లలో పరిస్థితి
- నోటీసులిచ్చిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు
మియాపూర్, వెలుగు: వాడిన నూనెతోనే వంటలు, లేబుల్లేని, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కూరగాయలపై ఫంగస్, అపరిశుభ్రంగా కిచెన్, అధిక సంఖ్యలో బొద్దింకలు.. ఇవన్నీ మియాపూర్, కొండాపూర్‌లోని 2 రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కనిపించాయి. మియాపూర్మదీనగూడలోని అంతేరా రెస్టారెంట్అండ్బార్లో అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు.
ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు అందుబాటులో లేనట్లు గుర్తించారు. నీటి నాణ్యత పరీక్ష నివేదికలు సమర్పించకపోవడంతో యాజమాన్యంపై సీరియస్ అయ్యారు.
డిజర్ట్స్, నాన్ వెజ్ ఐటమ్స్, మష్రూమ్స్, తరిగిన ఉల్లిపాయలను సరైన లేబులింగ్ లేకుండా నిల్వ చేసినట్లు తేల్చారు. కాలీఫ్లవర్, బంగాళాదుంపలపై ఫంగస్ ఉన్నట్లు, వాడిన వంట నూనెను మళ్లీ వాడేందుకు స్టోర్ చేసినట్లు గుర్తించారు.
కొండాపూర్జూబ్లీ ఎన్ క్లేవ్ లోని లా పినోజ్ పిజ్జా సెంటర్ లోనూ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ భారీగా బొద్దింకలు కనిపించాయి. గడువు ముగిసిన మసాలా మిక్స్‌లు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్ ఉత్పత్తులు వాడుతుండటం,లేబుల్లేకుండా ఆహార పదార్థాలను నిల్వ చేయడంపై ఫైర్అయ్యారు. ఆహార నిల్వ ప్రాంతం వద్ద బల్లులు తిరుగుతుండడం గుర్తించారు. అనంతరం ఆయా రెస్టారెంట్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు.