
వారఫలాలు ( 2026 జూన్21-27 ) : ఈ వారంలో గ్రహ సంచారంలో భారీ మార్పులు ఉన్నాయి.. సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే కర్కాటక రాశిలో బుధ సంచారం జరుగనుంది. ఇంకా మరికొన్ని గ్రహాలస్థానాలు మారే అవకాశం ఉంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహాల మార్పుతో ఏ రాశి వారికి అదృష్టం కలిసి ఉంటుంది. ఎవరికి అనూలంగా ఉంటుంది.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. 12 రాశుల వారి వారఫలాలను తెలుసుకుందాం..!
మేష రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యవిషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారం మధ్యలో గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగస్తులు ఆఫీసులో మీరే కీలకపాత్ర పోషిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు.ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ప్రేమ..పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైన ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వ్యానారస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
మిథున రాశి : ఈ రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఈ వారంలో ఆత్మవిశ్వాసం.. లీడర్ షిప్ బాధ్యతలు పెరుగుతాయి. సేవింగ్స్ వైపు దృష్టి సారించే అవకాశం ఉంది, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహాల సంచారం వలన శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. వ్యాపారులు ఊహించిన విధంగా లాభాలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. బ్యాంకు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయాలు ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన కానుకలు కొంటారు. ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
సింహ రాశి : ఈరాశి వారికి ఈ వారం సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. గందరగోళం తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.. ఆదాయం పెరుగుతుంది. అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.
కన్యా రాశి : ఈ రాశి ఈ వారంలో కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి. సమాజంలో కీర్తి.. ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి చేతికి వస్తుంది. కెరీర్ పై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రతి పనిని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
తులా రాశి : ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి .. వ్యాపారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాయింట్ వ్యాపారాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఊహించని సంఘటనలు ఎదురుకావచ్చు.. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈ వారంలో ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉంది. జాయింట్ వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కోపాన్ని అదుపుచేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎవరితోనూ అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు తక్కువుగా మాట్లాడండి. వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో అనవసరంగా మాట పడాల్సి రావచ్చు. ఆర్థికపరంగా ఖర్చులు అధికమవుతాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. ప్రేమ… పెళ్లి విషయాలను వాయిదా వేయండి. ప్రతి విషయంలో కూడా సీక్రసీని మెయిన్టైన్ చేయండి. అంతా మంచే జరుగుతుంది.
మకర రాశి : ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు పూర్తవుతాయి. పనులు ఆలస్యం అవుతున్నాయని నిరుత్సాహం చెందవద్దు. పని ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఏర్పడినా .. సునాయాశంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు
కుంభ రాశి : ఈ రాశి ఈ వారం బిజీబీజీగా గడుపుతారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి… వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మీన రాశి : ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగాసాగిపోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా మంచే జరుగుతుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.