Reading Time: < 1 minute

మొన్న తల్లి.. ఇవాళ తండ్రి..మూడు రోజుల్లో భార్యభర్తల బలవన్మరణం.. అనాథలైన ముగ్గురు పిల్లలు

Caption of Image.

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. మొన్న భార్య ఉరివేసుకొని చనిపోయింది. అది తట్టుకోలేక  మనస్థాపానికి గురైన భర్త ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు.  మూడు రోజుల వ్యవధిలో భార్యభర్తలు బలవన్మరణానికి పాల్పడటంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా ఇస్లాంపూర్ లో జరిగింది. దీంతో గ్రామస్తులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. 

ఆదివారం (జూన్ 21) మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని గీత స్కూల్ వెనకాల చెట్టుకు ఉరివేసుకొని ఓ వ్యక్తి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు పంపించారు.  మృతుడు ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన బిక్షపతి(45)  గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

పోలీసుల ప్రకారం.. బిక్షపతి  భార్య మూడు రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన బిక్షపతి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. మూడు రోజుల వ్యవధిలో భార్యభర్తలు  మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. 

©️ VIL Media Pvt Ltd.