
ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 2026 సెప్టెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి ధరల విషయంలో ఆపిల్ ఒక కొత్త ప్లాన్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ కోసం వాడిన ఫార్ములానే ఆపిల్ కూడా వాడబోతోందని వార్తలు వస్తున్నాయి.
ప్రో మ్యాక్స్ ధర
సాధారణంగా కొత్త మోడల్ రాగానే ధరలు పెరుగుతాయని అందరూ అనుకుంటారు. కానీ, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరను పెంచకుండా, పాత ధరకే అందుబాటులో ఉంచాలని ఆపిల్ భావిస్తోంది. ప్రీమియం ఫోన్లు కొనేవారు కెమెరా, బ్యాటరీ, ఏఐ (AI) ఫీచర్ల కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. వారిని ఆకర్షించడానికి ధరను స్థిరంగా ఉంచడం ఆపిల్ ప్లాన్.
శాంసంగ్ రూట్లోనే ఆపిల్
ఈ ఏడాది ప్రారంభంలో శాంసంగ్ కూడా ఇదే పనిచేసింది. గెలాక్సీ S26 అల్ట్రా ధరను పెంచకుండా అలాగే ఉంచి, తక్కువ మోడళ్లయిన గెలాక్సీ S26, S26 ప్లస్ ధరలను మాత్రమే పెంచింది. ఇప్పుడు ఆపిల్ కూడా అదే ఫార్ములా పాటిస్తూ, టాప్ మోడల్ ధరను అలాగే ఉంచి, మిగిలిన మోడళ్ల ధరలు పెంచే అవకాశం ఉంది.
ఐఫోన్లు కాస్ట్లీ కానున్నాయా
ప్రో మ్యాక్స్ ధర పెరగకపోయినా, సామాన్యులు కొనే ఐఫోన్ 18, ఐఫోన్ 18 ఎయిర్ వంటి మోడళ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫోన్ తయారీ ఖర్చులు పెరగడంతో, ఆ భారాన్ని ఆపిల్ ఈ తక్కువ ధర ఫోన్లపై వేయాలని చూస్తోంది. దీనివల్ల 2027 నాటికి బేసిక్ ఐఫోన్ మోడల్స్ కూడా ఇంతకుముందు కంటే ఖరీదైనవిగా మారోచ్చు.
ALSO READ : ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విదేశాల నుంచి గోల్డ్ తెప్పించుకుంటుంటే జాగ్రత్త..
స్టోరేజ్ విషయంలో మార్పులు
ధరను స్థిరంగా ఉంచడానికి ఆపిల్ మరో ప్లాన్ కూడా చెయ్యొచ్చు. తక్కువ మెమరీ ఉండే 128GB ఫోన్లను తీసేసి, 256GB నుండే అమ్మకాలు మొదలుపెట్టవచ్చు. అంతేకాకుండా, ఎక్కువ మెమరీ కావాలనుకునే వారి కోసం 512GB లేదా 1TB మోడళ్ల ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది.
ఎందుకీ ప్లాన్
ఆపిల్ కంపెనీకి అత్యంత ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టేది ప్రో మ్యాక్స్ మోడలే. అందుకే ఆ ఫోన్ ధరను పెంచి కస్టమర్లను దూరం చేసుకోకుండా, ఇతర మోడళ్ల ధరల అడ్జస్ట్ ద్వారా లాభాలను కాపాడుకోవాలని ఆపిల్ చూస్తోంది. అయితే ఇవి ప్రస్తుత సమాచారం ఆధారంగా అంచనాలు మాత్రమే. 2026 సెప్టెంబర్‌లో ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్ విడుదలయ్యే సమయానికి కంపెనీ నిర్ణయాల్లో మార్పులు ఉండవచ్చు.