Reading Time: 2 minutes
EPFO: పీఎఫ్ చందాదారులకు అలెర్ట్.. అమల్లోకి వచ్చిన ‘ఫారమ్ 121’..ఇక ఇవి పని చేయవు!

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు ఆదాయపు పన్ను నిబంధనలలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. గతంలో టీడీఎస్ (TDS) మినహాయింపు కోసం ఉపయోగించే ఫారమ్ 15G, 15Hలను రద్దు చేస్తూ, వాటి స్థానంలో ఏకీకృత ఫారమ్ 121 (Form 121)ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మార్పు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చింది.

ఫారమ్ 121 అంటే ఏమిటి?

మీ వార్షిక ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు, పీఎఫ్ విత్‌డ్రాయల్స్ లేదా వడ్డీపై టీడీఎస్ కట్ అవ్వకుండా ఉండటానికి సమర్పించే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ ఇది. గతంలో వయసును బట్టి రెండు వేర్వేరు ఫారమ్‌లు ఉండేవి. కానీ ఇప్పుడు అందరికీ ఒకే ఫారమ్ ఉంటుంది.

ముఖ్యమైన మార్పులు ఇవే:

వయసుతో సంబంధం లేదు. గతంలో 60 ఏళ్ల లోపు వారు ఫారమ్ 15G, సీనియర్ సిటిజన్లు ఫారమ్ 15H వాడేవారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ ‘ఫారమ్ 121’ మాత్రమే వాడాలి.

ఎవరు ఫైల్ చేయవచ్చు?:

భారతీయ పౌరులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs), కొన్ని రకాల ట్రస్టులు ఈ ఫారమ్‌ను ఉపయోగించుకోవచ్చు.ఈ ఫారమ్ నింపేటప్పుడు గత రెండేళ్ల ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) అక్నాలెడ్జ్‌మెంట్ వివరాలను పొందుపరచడం తప్పనిసరి. యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (UIN): ప్రతి ఫారమ్ సమర్పించినప్పుడు పారదర్శకత కోసం ఒక ప్రత్యేకమైన UIN నంబర్ కేటాయించబడుతుంది.

పీఎఫ్ చందాదారులు ఏం చేయాలి?

ఏప్రిల్ 1, 2026 నుండి: మీరు పీఎఫ్ డబ్బులు డ్రా చేసేటప్పుడు టీడీఎస్ కట్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఫారమ్ 121 సమర్పించాలి. ఒకవేళ మీ విత్‌డ్రాయల్ రూ.50,000 దాటి మీరు ఈ ఫారమ్ సమర్పించకపోతే, నిబంధనల ప్రకారం టీడీఎస్ కోత విధిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి కొత్తగా ఈ ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ప్రయోజనం:

ఈ మార్పు వల్ల సామాన్య పన్ను చెల్లింపుదారులకు గందరగోళం తగ్గుతుంది. ఏ ఫారమ్ ఎంచుకోవాలనే తికమక లేకుండా ఒకే ఫారమ్‌తో పని పూర్తవుతుంది. ఇది డిజిటల్ పద్ధతిలో ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్ ద్వారా సులభంగా అందుబాటులో ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: Hyundai: హ్యుందాయ్ నుంచి అదిరిపోయే ఈవీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 496 కి.మీ రేంజ్.. బడ్జెట్‌ ధరల్లోనే..

ఇది కూడా చదవండి: Will Rules: మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇలా చేయండి.. ఇది ఎందుకంత ముఖ్యం?

ఇది కూడా చదవండి: Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి.. భారీగా తగ్గిన ధరలు.. ఎంత తగ్గిందంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి