Reading Time: 3 minutes
Jacob Bethell Dating Indian Girl Ankita Patel Aadhya Anand Rumors

Jacob Bethell: ఇంగ్లండ్ యువ క్రికెట్ సంచలనం జాకబ్ బెథెల్ (Jacob Bethell) ఆటతోనే కాకుండా ఇప్పుడు తన పర్సనల్ లైఫ్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ యువ ఆల్‌రౌండర్ ఒక ఇండియన్ అమ్మాయితో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఆయన ఒక అమ్మాయితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఫొటో కూడా నెట్టింట వెలుగులోకి రావడంతో ఈ ప్రేమ పుకార్లకు మరింత బలం చేకూరింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోలో జాకబ్ ఒక అమ్మాయిని కౌగిలించుకుని రొమాంటిక్‌గా పోజు ఇస్తూ కనిపించాడు. అయితే ఆ ఫొటోలో సదరు అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో అసలు జాకబ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరై ఉంటుందా? అని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం స్టార్ట్ చేశారు.

సోషల్ మీడియా నెటిజన్ల రీసర్చ్ ప్రకారం.. ఆ ఫొటోలో ఉన్నది ముంబైకి చెందిన ప్రముఖ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అంకితా పటేల్ అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అంకిత బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న మేకప్ ఆర్టిస్ట్. ఆమె గతంలో స్టార్ హీరోయిన్లు శిల్పా శెట్టి, పలక్ తివారీ, హినా ఖాన్ వంటి సెలబ్రిటీలతో కలిసి పనిచేసింది. జాకబ్ ఆమె ప్రేమలోనే పడ్డాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రేమ వ్యవహారంలో అంకితా పటేల్ పేరుతో పాటు మరో భారతీయ యువ నటి ఆధ్యా ఆనంద్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఐపీఎల్ (IPL) సమయంలో జాకబ్, ఆధ్యా ఒకరికొకరు బాగా దగ్గరయ్యారని కొందరు నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో ఆధ్యా ఆనంద్ పెట్టే ప్రతి పోస్ట్‌ను జాకబ్ బెథెల్ రెగ్యులర్‌గా లైక్ చేస్తూ వస్తుండటాన్ని ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లతో సహా బయటపెడుతున్నారు. ఒకవైపు ముంబై మేకప్ ఆర్టిస్ట్ అంకిత, మరోవైపు నటి ఆధ్యా ఆనంద్.. ఈ ఇద్దరిలో జాకబ్ మనసు దోచింది ఎవరనే సస్పెన్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చర్చకు కారణం అవుతుంది. అయితే ఈ రూమర్లపై అటు క్రికెటర్ జాకబ్ బెథెల్ కానీ, ఇటు అంకిత లేదా ఆధ్యా కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వైరల్ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వారిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.