
బద్లాపూర్: ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. బద్లాపూర్ సమీపంలోని ముంబై– -వడోదర హైవేపై అతివేగంగా దూసుకొచ్చిన ఒక బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం వేకువజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
బీఎండబ్ల్యూ జెడ్-4 స్పోర్ట్స్ కారు సుమారు 250 కి.మీ. వేగంతో తిత్వాలా నుంచి బద్లాపూర్ వైపు దూసుకువస్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దాని విడిభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కారులోని ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.