Reading Time: < 1 minute

మూడు యుద్ధ నౌకలను ప్రారంభించిన ప్రధాని

Caption of Image.

ఒక దేశ అభివృద్ధి, భద్రత, శ్రేయస్సుకు సముద్ర శక్తే అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బలమైన సముద్ర సామర్థ్యమే ఒక దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావానికి నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని చెప్పారు. భారతదేశం ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నదని, అందుకే సముద్ర భద్రత, ఇతర అంశాల్లో సామర్థ్యం పెంచుకునేందుకు సిద్ధమవుతోందన్నారు. ఆదివారం కోల్‌‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్ ఫ్రిగేట్ దుణగిరి, సర్వే నౌక సంశోధక్, జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక అగ్రయ్‌‌లను ప్రధాని నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
 

©️ VIL Media Pvt Ltd.