Reading Time: < 1 minute

చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ.. మోడీ 12 ఏళ్ల పాలనపై మెగాస్టార్ ప్రశంసలు!

Caption of Image.

మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో ని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దీంతో వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంది.  కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కార్ విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  

ఇందులో భాగంగానే, చిరును  తెలంగాణ బీజేపీ ముఖ్య నేత రామచందర్ రావు కలిశారు. గత 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వం సాధించిన ప్రగతి, దేశ ఆర్థిక పురోగతి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన ఒక స్పెషల్ బుక్‌లెట్, బ్రోచర్లను మెగాస్టార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వీరి మధ్య జాతీయ, రాష్ట్ర రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మోడీ పాలనపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనని, ప్రభుత్వ విజయాలను వివరించడానికే కలిశామని బీజేపీ నేతలు తెలిపారు.  మోడీ ప్రభుత్వ సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులకు, ప్రజలకు చేరవేసే ‘మహా‌జన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగానే ఈ భేటీ జరిగినట్లుగా వెల్లడించారు.

 

©️ VIL Media Pvt Ltd.