
లవ్ వైరస్ 2.. ఇదో షార్ట్ ఫిల్మ్. లవ్ వైరస్ షార్ట్ ఫిల్మ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా.. 40 నిమిషాల రన్ టైం ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ను జస్ట్.. కేవలం 36 గంటల్లోనే మేకింగ్ చేయటం. లేటెస్ట్ గాఈ లవ్ వైరస్ 2 సాంగ్ ను విడుదల చేశారు ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. లవ్ వైరస్ తొలి భాగానికి సోషల్ మీడియాలో వచ్చిన మంచి రెస్పాన్స్, ఆదరణతో పార్ట్ 2 నిర్మించటం అభినందనీయంగా చెప్పుకొచ్చాడు . కొత్త వ్యక్తులను, కొత్త తరం యువతను ప్రోత్సహిస్తూ నిర్మించిన లవ్ వైరస్ 2 మంచిగా హిట్ అవ్వాలని టీంను వినాయక్ అభినందించారు.
స్వయంకృషి క్రియేషన్స్ బ్యానర్‌పై లవ్ వైరస్ 2కు జర్నలిస్ట్ ఎస్.డి.నుమన్ దర్శకత్వం వహించగా.. నిర్మాతగా అరమాస ప్రవీణ్ ఉన్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా లవ్ వైరస్ సిరీస్ రూపొందిస్తున్నారు. లవ్ వైరస్ హిట్ కావటంతో.. లవ్ వైరస్ 2 రూపొందించటం జరిగిందని దర్శక, నిర్మాతలు వెల్లడించారు.
మొదటి భాగానికి ప్రేక్షకులు అందించిన ఆదరణతో మరింత బాధ్యతగా లవ్ వైరస్–2 రూపొందిస్తున్నామని.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉంటుందని స్పష్టం చేశారు దర్శకులు ఎస్.డి.నుమన్. లవ్ వైరస్ 2 టీంలో భాను ప్రకాష్, గణపతి, శ్యామ్, డిఓపీ. హరీష్, శ్రీహర్ష, గ్రాఫిక్ డిజైనర్ ఉదయ్ శంకర్ ఉన్నారు. త్వరలోనే లవ్ వైరస్ 2 విడుదల కానున్నట్లు ప్రకటించారు యూనిట్ సభ్యులు.