Reading Time: < 1 minute
AP Polycet 2026 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ఈ సర్టిఫికెట్లు వెంటనే సిద్ధం చేసుకోండి

అమరావతి, జూన్‌ 22: ఆంధ్రప్రదేశ్‌ పాలీటెక్నిక్‌ డిపొమా కోర్సు్ల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలీటెక్నికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. డిప్లొమా ప్రవేశాలకు తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 24 నుంచి మొదలవనుంది. ఇది జులై 4 వరకు కొనసాగుతుంది. అర్హత పొందిన అభ్యర్థులు కాలేజీలు, బ్రాంచీలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.

కౌన్సెలింగ్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలు: జూన్‌ 24 నుంచి జూన్‌ 30 వరకు.
  • హెల్ప్‌లైన్‌ సెంటర్లలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మార్పులు, సవరణ తేదీలు: జూన్‌ 25 జులై 1 వరకు
  • వెబ్‌ ఆప్షన్ల నమోదు: జూన్‌ 29 నుంచి జులై 3
  • వెబ్‌ ఆప్షన్లలో మార్పులు: జులై 4
  • సీట్ల కేటాయింపు: జులై 6న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు ఫలితాలు
  • సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, కాలేజీలో రిపోర్టింగ్: జులై 7 నుంచి జులై 10 వరకు
  • తరగతులు ప్రారంభం: జులై 7 నుంచి

వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు ఈ కింది ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

కౌన్సెలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్లు ఇవే..

  • ఏపీ పాలీసెట్‌ 2026 హాల్‌టికెట్‌
  • ఏపీ పాలీసెట్‌2026 ర్యాంక్‌ కార్డు
  • అభ్యర్థి ఆధార్‌ కార్డు
  • టెన్త్‌ మార్కుల మెమో
  • 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌
  • నాన్‌-లోకల్‌ అభ్యర్థులకు నివాస ధ్రువపత్రం
  • ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ (అవసరమైతే)
  • ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌
  • SC/ST/BC అభ్యర్థులకు కుల సర్టిఫికెట్
  • మైనారిటీ సర్టిఫికెట్‌
  • టీసీ సర్టిఫికెట్

వంటి అవసరమైన సర్టిఫికెట్లు కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే chepolycet@gmail.com ఈమెయిల్ ఐడీ ద్వారా లేదా 7842075469, 7842085469, 7842095469 హెల్ప్ లైన్ నంబర్లను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చు.