Reading Time: 2 minutes

నేడే అర్జెంటీనా vs ఆస్ట్రియా బిగ్ ఫైట్.. 100వ మ్యాచ్‌కు సిద్ధమైన ఎంబాప్పే.. మెస్సీపైనే అందరి చూపు!

Caption of Image.

Lionel Messi: అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ 2026లో 12వ రోజు మరికొన్ని హై-వోల్టేజ్ మ్యాచ్‌లతో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధమైంది. నేడు ( జూన్ 22న, సోమవారం) డల్లాస్ స్టేడియంలో జరగబోయే గ్రూప్-జె క్లాష్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రియా జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో అదిరిపోయే హ్యాట్రిక్‌తో చెలరేగిన లియోనెల్ మెస్సీ మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. మరోవైపు ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాప్పే తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ అంతర్జాతీయ మ్యాచ్ మైలురాయిని అందుకోబోతున్నాడు.

అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రియా: 
అల్జీరియాపై 3–0 తేడాతో ఘన విజయం సాధించి టోర్నీని గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన అర్జెంటీనా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి రౌండ్ ఆఫ్ 32 (Round of 32) బెర్తును కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో టాప్ పర్ఫామర్‌గా మెస్సీ దూసుకుపోతున్నాడు. కాగా తమ మొదటి మ్యాచ్‌లో జోర్డాన్‌ను 3–1తో ఓడించిన ఆస్ట్రియా టీమ్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. రాల్ఫ్ రాంగ్‌నిక్ నేతృత్వంలోని ఈ జట్టు అర్జెంటీనాకు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. 

ఫ్రాన్స్ వర్సెస్ ఇరాక్: 
ఇరాక్‌తో జరగబోయే మ్యాచ్ ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాప్పేకు 100వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఒలీవియర్ గిరూడ్ (57 గోల్స్) రికార్డును బద్దలు కొట్టి, ఫ్రాన్స్ హిస్టరీలోనే ఆల్‌టైమ్ లీడింగ్ స్కోరర్‌గా (58 గోల్స్) నిలిచిన ఎంబాప్పే.. ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాలని చూస్తున్నాడు. మరోవైపు, 1986 తర్వాత మళ్లీ వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన ఇరాక్ జట్టుకు మొదటి మ్యాచ్‌లోనే నార్వే చేతిలో 4–1తో ఘోర పరాజయం ఎదురైంది. బలమైన ఫ్రాన్స్‌ను అడ్డుకోవడం వారికి అగ్నిపరీక్షే.

►ALSO READ | ఐపీఎల్‌లో మరో బిగ్ ట్రేడ్: హార్దిక్ కోసం రాజస్థాన్ ప్రయత్నం.. ఆ స్టార్ ప్లేయర్ని ఇవ్వమన్న ముంబై!

నార్వే వర్సెస్ సెనెగల్: 
మాంచెస్టర్ సిటీ స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ మొదటి మ్యాచ్‌లోనే రెండు గోల్స్ కొట్టి నార్వేకు 4–1తో అదిరిపోయే విక్టరీ అందించాడు. ఫ్రాన్స్ చేతిలో 3–1 తేడాతో ఓడిపోయిన సెనెగల్ జట్టు, హాలాండ్‌ను ఎలా కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

జోర్డాన్ వర్సెస్ అల్జీరియా: 
ఫిఫా వరల్డ్ కప్ డెబ్యూటెంట్ జోర్డాన్ తమ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రియా చేతిలో ఓడిపోయింది. కనీసం ఈ మ్యాచ్‌లోనే అయినా గెలిచి హిస్టారికల్ ప్రపంచకప్ లో మొదటి పాయింట్ సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే మొదటి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో దెబ్బతిన్న అల్జీరియా కూడా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.