
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీఓ ఆఫీసు దగ్గర తనిఖీలు చేస్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఆర్టీఓ. సోమవారం ( జూన్ 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీఓ ఆఫీసు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఆర్టీఓ వెంకన్న.
బొగ్గు లోడు తో వెళ్తున్న టిప్పర్ లారీ అతివేగంతో దూసుకు వచ్చిన వెంకన్నను ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆర్టీవో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. వెంకన్న పై నుంచి టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. లారీ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. వెంకన్న ఇటీవలే బదిలీపై భూపాలపల్లి ఆర్టీఓగా వచ్చినట్లు తెలుస్తోంది.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఉహించని ప్రమాదంలో ఆర్టీఓ మృతి చెందడంతో సిబ్బందితో పాటు ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
మంత్రి పొన్నం దిగ్బ్రాంతి:
ఆర్టీఓ వెంకన్న మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. విధి నిర్వహణలో ఉండగా మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) శ్రీ వెంకన్న ఘోర రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారని తెలియజేయడానికి ఎంతో విచారిస్తున్నామని…ఈ విషాదకర ఘటన పట్ల రవాణా శాఖ ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తుందని అన్నారు .
ఈ తీరని లోటును భరించే ధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని…శ్రీ వెంకన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు మంత్రి పొన్నం.