
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోచింగ్ సెంటర్ లో ఫైర్ యాక్సిడెంట్ తో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వేడిని భరించలేక.. తప్పించుకునే మార్గం లేక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ప్రాణాలు లెక్క చేయకుండా దూకేశారు. విద్యార్థులు దూకుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లక్నోలోని అలీగంజ్ ఏరియాలో కోచింగ్ కమ్ గేమింగ్ జోన్ లో సోమవారం (జూన్ 22) జరిగింది ఈ ఘటన. ఈ ప్రమాదంలో స్పాట్ లో నలుగురు చనిపోయారు. చికిత్స పొందుతూ మరో 7 మంది మృతి చెందారు. మరికొందరు విద్యార్థులు మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
విద్యార్థులు హాల్ లో ఉండగానే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు చేతిలో పెట్టుకుని విద్యార్థులు పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి దూకి గాయాలతో బయటపడ్డారు. నలుగురు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరికొందరు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సేఫ్టీ అధికారులు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షాక్ సర్క్యూట్ అని భావిస్తున్నారు.
►ALSO READ | మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠీ భూమి కబ్జా.. ఆయన తమ్ముడిపై కత్తులతో దాడి
ప్రమాద సమయంలో విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకుతున్న విజువల్స్ భయానకంగా కనిపిస్తున్నాయి. మంటల సమయంలో పక్కన ఉన్న బిల్డింగులను ఖాళీ చేయించారు.
DISTURBING VIDEO ADVISORY
FIRE AT A COACHING CENTER WILL REVIVE DEBATE AROUND UNREGULATED URBAN GROWTH.
In Lucknow, Uttar Pradesh several people were seen jumping from the first floor of a coaching center caught in a massive fire sparked by a short circuit. pic.twitter.com/1CVz1BZs8K— Rahul Shivshankar (@RShivshankar) June 22, 2026
ఇక్కడ లైబ్రరీ, కంప్యూటర్, గేమింగ్ ఇన్ స్టిట్యూట్లు ఉన్నాయి. అక్కడ పెద్దఎత్తున పొగలు వస్తుండటం చూసి ఐదు ఆరు మందిని కాపాడాము.మంటలకు తాళలేక ఒక వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకాడు. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.. అని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.