Reading Time: < 1 minute

ఓ సుకుమారి మూవీ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్…

Caption of Image.

తిరువీర్, ఐశ్వర్య రాజేష్​ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఆదివారం టైటిల్‌‌ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు.  భరత్ మంచిరాజు కంపోజ్ చేసిన పాటకు పూర్ణచారి క్యాచీ లిరిక్స్ అందించగా, అభిజిత్ రావు పాడిన తీరు ఆకట్టుకుంది. 

‘హే  ఓ సుకుమారి.. కన్నుల దారి, నీవైపే చేరే సుందరి.. హే ఓ సుకుమారి.. చూపుల దాడి.. ఏమాయ చేసావే  సొగసరి..’ అంటూ సాగిన  పాట  ప్రేమలో పడిన యువకుడి భావాలను ప్రెజెంట్ చేసేలా సాగింది.  

ఇందులో  తిరువీర్ తన ప్రేమను అమాయకంగా, నిజాయితీగా వ్యక్తం చేస్తుండగా, ఐశ్వర్య రాజేష్ ఆ ప్రేమను ఆస్వాదిస్తూ, తన భావాలను అందంగా పలికించే తీరు ఆకట్టుకుంటుంది.  మురళీధర్ గౌడ్, విష్ణు ఓయ్, ఝాన్సీ, ఆమని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలోనే  విడుదల కానుంది.
 

©️ VIL Media Pvt Ltd.