Reading Time: 2 minutes

ఓడియమ్మా.. ఇవేం సిక్సులు భయ్యా.. బౌలర్లని బ్రతకనివ్వరా.. వరుసగా 6, 6, 6, 6, 6లతో విధ్వంసం!

Caption of Image.

Rovman Powell 5 sixes: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో లాస్ యాంజెలిస్ నైట్ రైడర్స్ (LAKR) స్టార్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ శనక వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన పావెల్, ఆఖరి బంతికి మాత్రం ఔట్ కావడంతో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టే అరుదైన ప్రపంచ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. సంచలన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ మూమెంటమ్‌ను పూర్తిగా మార్చేసిన ఈ వెస్టిండీస్ పవర్ హిట్టర్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాడు. 

వరుసగా 6, 6, 6, 6, 6, W: 
సీయాటిల్ ఓర్కాస్ (Seattle Orcas) జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో లాస్ యాంజెలిస్ నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో అసలైన ఫైట్ జరిగింది. దసున్ శనక బౌలింగ్‌కు రాగానే పావెల్ మొదటి బంతి నుంచే అటాకింగ్ స్టార్ట్ చేశాడు. గ్రౌండ్ చుట్టూ భారీ షాట్లతో విరుచుకుపడుతూ మొదటి 5 బంతులను స్టాండ్స్‌లోకి పంపించేశాడు. దాంతో స్టేడియంలోని ఫ్యాన్స్ అంతా ఒకే ఓవర్‌లో 6 సిక్సర్ల రికార్డు (Six Sixes in an over) నమోదు కాబోతుందంటూ సంతోషించారు. 

5 బంతుల్లో 5 సిక్సులు.. లాస్ట్ కి పావెల్ ఔట్: 
హిస్టారికల్ రికార్డును పూర్తి చేయాలనే కసితో ఆరో బంతికి కూడా పావెల్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ ఈసారి శనక తెలివిగా బంతి వేగాన్ని తీసేసి (Change of pace), ఫుల్లర్ డెలివరీ వేశాడు.. ఆ బంతిని సరిగ్గా టైమింగ్ చేయలేకపోయిన పావెల్, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ అవుటయ్యాడు. రికార్డు మిస్ అయినప్పటికీ, శనకకు చుక్కలు చూపించిన పావెల్ ఇన్నింగ్స్‌ని చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.  

11 బంతుల్లో 37 రన్స్.. 330+ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్: 
కేవలం 11 బంతులు మాత్రమే ఆడిన రోవ్‌మన్ పావెల్ 330 కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 37 రన్స్ చేశాడు. ఈ లేట్ క్యామియోతో లాస్ యాంజెలిస్ నైట్ రైడర్స్ బోర్డుపై 196 పరుగుల భారీ స్కోరును ఉంచగలిగింది.

ALSO READ : 12 ఓవర్లకి 12 పాయింట్లు కట్.. 

నైట్ రైడర్స్ ఘనవిజయం: 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సీయాటిల్ ఓర్కాస్ జట్టును లాస్ యాంజెలిస్ బౌలర్లు కట్టడి చేశారు. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ అండ్ కో తమ క్లాస్ బౌలింగ్‌తో సీయాటిల్ జట్టును కేవలం 115 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో లాస్ యాంజెలిస్ నైట్ రైడర్స్ ఘనవిజయం సాధించింది. 

 

 

©️ VIL Media Pvt Ltd.