Reading Time: 2 minutes

మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠీ భూమి కబ్జా.. ఆయన తమ్ముడిపై కత్తులతో దాడి

Caption of Image.

Pankaj Tripathi: బీహార్ రాష్ట్రం బీజేపీ పాలనలో జరిగిన ఘోరం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి తెలుసుకదా.. OTT వెబ్ సిరీస్ లో అతనే టాప్ ఇప్పుడు. దేశ వ్యాప్తంగా ఎంతో మందికి సుపరిచితుడు అయిన పంకజ్ త్రిపాఠి కుటుంబానికి బీహార్ రాష్ట్రంలో భూమి ఉంది. ఇది పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ భూమిని ఆయన సోదరుడు చూసుకుంటూ ఉంటారు. ఆయనది బీహార్ రాష్ట్రమే. 

బీహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లాలో నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడు బీజేంద్రనాథ్ తివారీ ఉంటున్నారు. పూర్వీకుల నుంచి వచ్చిన భూమిగా ఆయన చెబుతున్నారు. ఈ భూమి విషయంలో స్థానిక వ్యక్తులతో వివాదం మొదలైంది. ఈ భూమి తమదే అని.. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అని పంకజ్ త్రిపాఠి సోదరుడు చెబుతున్నారు. ఈ భూమి మాదే అంటూ కొంత వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారు. 

ఈ దాడిలో పంకజ్ త్రిపాఠి సోదరుడు బీజేంద్రనాథ్ తివారీ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని  గోపాల్ గంజ్ మోడల్ ఆస్పత్రికి తరలించారు. సీరియస్ గా ఉండటంతో అక్కడి నుంచి పాట్నాలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

పంకజ్ త్రిపాఠికి బీహార్ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా బీహార్ లో అతనికి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పంకజ్ త్రిపాఠి కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసింది. విచారణ కోసం ప్రత్యేక పోలీస్, రెవెన్యూ బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 

పంకజ్ త్రిపాఠి సోదరుడిపై జరిగిన దాడిని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందించారు. బీహార్ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన, అరాచకమైన పాలన నడుస్తుంది అనటానికి ఇదే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. బీహార్ రాష్ట్రంలోనే ఓ ప్రముఖ వ్యక్తి ఆస్తులకే రక్షణ లేదని.. ఇక సామాన్యుల దుస్థితి ఎలా ఉందో చెప్పటానికి ఇదే ఎగ్జాంపుల్ గా స్పష్టం చేశారు ఎంపీ మనోజ్ ఝా. బీహార్ రాష్ట్రంలో ప్రతి రోజు ప్రతి కుటుంబం భయంతో బతుకుతుందని.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం సామాన్యుల్లో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ మనోజ్. 

ఆర్జేడీ ఎంపీ వ్యాఖ్యలను ఖండించింది జనతాదళ్ పార్టీ. పంకజ్ త్రిపాఠి సోదరుడిపై దాడి చేసినోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతూ.. ఈ వివాదం పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్ని జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ వెల్లడించారు.
 

©️ VIL Media Pvt Ltd.