Reading Time: < 1 minute

భగవంతుడు మూవీలో గ్రామీణ యువతిగా.. ఫరియా అబ్దుల్లా…

Caption of Image.

తనదైన నటన, గ్లామర్‌‌‌‌తో టాలీవుడ్‌‌లో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది ఫరియా అబ్దుల్లా. ఆదివారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న ‘భగవంతుడు’ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్‌‌‌‌తో బర్త్‌‌డే విషెస్ తెలియజేసింది. ఇందులో  ఫరియా  గ్రామీణ యువతి పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకుంది.  నీలిరంగు చీర, ఎరుపు బ్లౌజ్‌‌లో నేచురల్‌‌గా  కనిపించిన ఆమె భుజంపై వ్యవసాయ పనులకు ఉపయోగించే కొడవలి,  అల్యూమినియం బాక్స్‌‌ను మోస్తూ కనిపిస్తోంది. 

గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యతను ఈ లుక్ స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖంలో అమాయకత్వం, కళ్లలో ధైర్యం, శ్రమజీవి మహిళగా కనిపించే తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో  తిరువీర్ హీరోగా  నటిస్తుండగా, తనకు జంటగా  ఫరియా అబ్దుల్లా కనిపించనుంది.  

జి.జి. విహారి  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో  రవి పనస నిర్మిస్తున్నారు.  కన్నడ నటుడు రిషి ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.  పీరియాడిక్  పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

©️ VIL Media Pvt Ltd.