Reading Time: < 1 minute
Hyderabad Metro Good News During Rtc Strike Services Frequency Increased

Hyderabad Metro: ఆర్టీసీ కార్మికుల సమ్మే వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. టీజీఆర్టీసీ సమ్మె ప్రభావంతో మెట్రో సేవలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎంఆర్‌ఎల్ మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచింది. రోజంతా గరిష్టంగా 56 మెట్రో రైళ్లు నడపాలని నిర్ణయించింది. రద్దీ సమయాల్లో ప్రతి 3 నిమిషాలు 40 సెకన్లకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. నాన్‌పీక్ అవర్స్‌లో రైళ్ల సంఖ్యకు 44 రైళ్లు తగ్గించారు. మియాపూర్–ఎల్‌బీనగర్ మార్గంలో 4 నిమిషాలు 20 సెకన్లకు ఒక రైలు అందుబాటులో ఉండనుంది. నాగోల్–రాయదుర్గ్ మార్గంలో 3 నిమిషాలు 40 సెకన్లకు మెట్రో రైలు అందుబాటులో ఉంటుంది. సమ్మెతో ఇబ్బందులు తగ్గించేందుకు మెట్రో కీలక చర్యలు తీసుకుంది. రాత్రి మెట్రో సేవల పొడిగింపుపై పరిశీలన చేయనుంది. చివరి మెట్రో రైలు సమయం 11 తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయంగా మెట్రో సేవల విస్తరణ చేశారు.

READ MORE: Delhi: ఢిల్లీలో దారుణం.. యూపీఎస్సీకి సిద్ధపడుతున్న యువతి హత్యాచారం

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్ల విలువ రూ.35 వేల కోట్లని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఎన్టీవీతో మాట్లాడారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు కొత్తవి కావని.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మొండి పట్టుదలతో కార్మిక సంఘాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. ఆర్టీసీనీ ప్రజల నుంచి దూరం చేయకండి.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ పరిస్థితి మెరుగు అవుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు. సమ్మెను విరమించి చర్చల్లో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 25% బస్సులు నడుస్తున్నాయని..ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె ఇల్లీగల్‌గా చేస్తున్నారని.. ఇది లేబర్ కమిషన్ చెబుతోందన్నారు. ఒక నెలలో ప్రస్తుతం 700 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుందని.. ఇలా సంఘాలు కావాలని సమ్మె లోకి వెళితే నష్టాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.. కాబట్టి సమ్మె విరమించండి.. చర్చలకు రండి… RTC నీ కాపాడండి అని పిలుపునిచ్చారు.