Reading Time: 2 minutes
How Ancient Palaces Stayed Cool Without Ac Fans Electricity Summer Secrets

How Ancient Palaces Stayed Cool Without AC or Electricity in Summer: దేశంలో ప్రస్తుతం వేడి పెరుగుతోంది. సూర్యడి వేడి తాపానికి జనాలు అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో వేడి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతో కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రజలు తమ తమ సామర్థ్యాలకు అనుగుణంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి.. ఈ రోజుల్లో వేడిని తగ్గించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ, ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, ఫ్యాన్లు కనుగొనక ముందు పరిస్థితి ఏంటి? అసలు కరెంట్ లేనప్పుడు ఇళ్లను చల్లగా ఎలా ఉండేవారు? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా వేసవిలో రాజులు, రాణులు, చక్రవర్తుల వైభవోపేతమైన రాజభవనాలు ఎలా చల్లగా ఉండేవి? అనే ప్రశ్నలు మీ మదిలో వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: India – Russia: కష్టకాలంలో కదిలొచ్చిన ‘మిత్రుడు’.. చమురు సంక్షోభంలో భారత్‌ను ఆదుకున్న రష్యా!

పురాతన పర్షియన్ (ఇరాన్) సామ్రాజ్యం నుంచి ఈజిప్ట్ వరకు ఎడారి ప్రాంతాల్లో ఇళ్లను చల్లబరచడానికి ఒక వినూత్న సాంకేతికతను వాడేవారు. దీనిని పర్షియన్ భాషలో ‘బాద్‌గీర్’ అని, అరబిక్‌లో ‘బర్జీల్’ అని పిలుస్తారు. ఇవి భవనాలపై ఎత్తైన గోపురాలు లేదా మీనార్లలా కనిపిస్తాయి. ఈ విండ్ క్యాచర్స్ ఎత్తులో వీచే గాలిని పట్టుకుని కిందకు పంపిస్తాయి. ఆ గాలి భవనం లోపలికి వెళ్లే క్రమంలో చల్లబడుతుంది.
అంతేకాదు.. మరింత చల్లదనం కోసం, ఈ గాలి వచ్చే మార్గంలో లేదా ఇంట్లోని ప్రాంగణాల్లో పెద్ద పెద్ద పాత్రల్లో నీటిని ఉంచేవారు. గాలి ఆ నీటిపై నుంచి వెళ్లడం వల్ల ఏసీ కంటే అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చేది.

READ MORE: SRH vs DC: ఉప్పల్‌లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!

మన రాజస్థాన్‌లోని జైపూర్, జైసల్మేర్ వంటి కోటల్లోనూ ఇలాంటి టెక్నిక్స్ కనిపిస్తాయి. కోటల సమీపంలో లేదా లోపల భారీ మెట్ల బావులను నిర్మించేవారు. ఇవి కేవలం నీటి అవసరాలకే కాకుండా, కోట లోపల తేమను పెంచి వాతావరణాన్ని చల్లగా ఉంచడానికి దోహదపడేవి. పూర్వ కాలంలో ఇళ్లను సున్నపు రాయి (Lime-stone) లేదా మట్టితో కూడిన మందపాటి గోడలతో నిర్మించేవారు. ఇవి బయటి వేడిని లోపలికి రానివ్వకుండా అడ్డుకునేవి. ఒక, కోటల గోడలకు ఉండే సన్నని జాలి కిటికీలు (జరోఖాలు) ‘వెంచురీ ఎఫెక్ట్’ ద్వారా గాలి వేగాన్ని పెంచి లోపలికి చల్లటి గాలిని పంపేవి. ముగులాయిల కాలంలో రాజభవనాల కారిడార్లలో పెద్ద పెద్ద నీటి కుండలు లేదా కొలనులను ఏర్పాటు చేసేవారు. కిటికీల నుంచి వచ్చే వేడి గాలి ఈ నీటి తాకిడికి చల్లబడి గదుల్లోకి ప్రవేశించేది. ఇక సామాన్యుల విషయానికి వస్తే, ప్రతి ఊరిలోనూ చెరువులు, కుంటలు ఉండటం వల్ల సహజంగానే వాతావరణం చల్లగా ఉండేది. ఇళ్ల చుట్టూ పెరడు, పైన పెంకులు లేదా గడ్డి వాములతో కూడిన పైకప్పులు వేడిని సమర్థవంతంగా తగ్గించేవి.