Reading Time: < 1 minute
Chanakya Niti Wisdom Honesty Vs Strategy Life Lessons

Chanakya Niti: భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత ఆచార్య చాణక్యుడికే దక్కుతుంది. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకున్న మేధావి ఆచార్య చాణక్య. నిజానికి ఆయన కేవలం ఒక రాజగురువు మాత్రమే కాదు.. గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, వ్యూహకర్త కూడా. నేటికీ చాణక్యుడు చెప్పిన సూత్రాలు వ్యక్తిగత జీవితానికే కాకుండా, రాజకీయాలకు, కార్పొరేట్ రంగానికి కూడా దారిచూపుతూనే ఉన్నాయి.

READ ALSO: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..

ఆ నిజాయితీ సూత్రం వెనుక రహస్యం
చాణక్యుడు చెప్పిన ఒక ప్రసిద్ధ సూక్తి నేటి సమాజానికి ఎంతో అవసరం. ఆయన ఏమంటారంటే “అడవిలో నిటారుగా ఉన్న చెట్లనే మొదటగా నరుకుతారు.. అలాగే అతిగా నిజాయితీగా ఉండేవారికి సమస్యలు కూడా అంతే త్వరగా ఎదురవుతాయి”. దీని అర్థం ఏమిటంటే.. ఈ మాట వినడానికి నిజాయితీకి వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినా, దాని వెనుక ఉన్న లోతైన వ్యూహం వేరు. చాణక్యుడి దృష్టిలో ప్రపంచం చాలా సంక్లిష్టమైనది. అడవిలో వంకరగా ఉన్న చెట్ల కంటే, నిటారుగా ఉన్న చెట్లే కలప కోసం మొదట గొడ్డలికి బలవుతాయి. అలాగే, లౌక్యం లేకుండా అతిగా నిజాయితీగా, ఎదుటివారిని గుడ్డిగా నమ్మే వ్యక్తులు మోసగాళ్ల చేతిలో సులువుగా చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.

ఈ సూక్తి ద్వారా చాణక్యుడు అవినీతిని ప్రోత్సహించడం లేదు. నిజాయితీతో పాటు వివేకం, ముందుచూపు, లౌక్యం ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరి దగ్గర ఎంతవరకు నిజాన్ని మాట్లాడాలి అనే విచక్షణ కలిగి ఉండటమే నిజమైన తెలివితేటలని ఆయన బోధిస్తున్నారు. “నిజాయితీగా ఉండండి.. కానీ దానితో పాటు లోకజ్ఞానాన్ని కూడా జోడించండి” అన్నదే చాణక్యుడి సందేశం. మనం ఎంచుకున్న మార్గం సరైనదైనప్పుడు, దానిని కాపాడుకోవడానికి అవసరమైన వ్యూహాలను కూడా మనం సిద్ధం చేసుకోవాలని ఆయన బోధిస్తున్నారు.

READ ALSO: PM Modi: మహిళలకు మోడీ బంపర్ ఆఫర్.. ప్రతి మహిళకు ఏటా రూ.36 వేలు! బెంగాల్ వేదికగా ప్రధాని హామీ