Reading Time: 2 minutes
Kl Rahul Surpasses Virat Kohli Best Batting Average Ipl 2026

IPL Record: ఐపీఎల్‌లో రికార్డులు, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఎవరు? అని అడగ్గానే టక్కున గుర్తుకు వచ్చే పేరు కింగ్ కోహ్లీ. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు, సెంచరీల రికార్డులు విరాట్ పేరిటే ఉన్నాయి. కానీ.. తాజాగా షాకింగ్ గణాంకాలు వెలువడ్డాయి. ఓ ప్లేయర్ ఏకంగా కోహ్లీని మించిపోయాడు. 2026 సీజన్ నాటికి విరాట్ కంటే అత్యంత నిలకడైన బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. కనీసం 50 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ సగటు ఇతరుల కంటే దాదాపు 10 శాతం ఎక్కువగా ఉంది. వరల్డ్ టీ20 క్రికెట్‌లో కోహ్లీ తోపు అయినా.. ఐపీఎల్‌లో మాత్రం కింగ్ కేఎల్ రాహుల్. ఐపీఎల్‌లో రాహుల్ 45.67 సగటుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (40.57) రెండు, డేవిడ్ వార్నర్ (40.52) మూడు, శుభ్‌మన్ గిల్ (40.36) నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఐదో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ (39.95) నిలవగా.. విరాట్ కోహ్లీ 39.76 సగటుతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు.

READ MORE: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..

2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాహుల్, ఈ లీగ్‌లో ఐదు జట్ల తరఫున ఆడాడు. గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ESPNcricinfo ప్రకారం , రాహుల్ 140 ఇన్నింగ్స్‌లలో 5,333 పరుగులతో తన 150వ మ్యాచ్‌లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో రాహుల్ ఐదు శతకాలు సాధించాడు. 41 హాఫ్ సెంచరీలు చేశాడు. 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం PBKS) తరఫున ఆడుతూ, రాహుల్ ఢిల్లీ జట్టుపై 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. IPL చరిత్రలో ఒక ఓపెనర్ చేసిన రెండవ అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ ఇది. రాహుల్ ఏడు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఈ జాబితాలో కోహ్లీ (8 సార్లు) మాత్రమే అతని కంటే ముందున్నాడు. ముఖ్యంగా, రాహుల్ 2020లో 670 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 45కు పైగా సగటుతో 5,000కు పైగా పరుగులు సాధించిన రాహుల్, లీగ్ చరిత్రలోనే అత్యంత నిలకడైన బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.