Reading Time: < 1 minute
Ntr Neel Crazy Project Alia Bhatt To Pair With Tarak Once Again

 గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్ పై  అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సాగాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఒక కీలక పాత్ర కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 Also Read : Vikram : విక్రమ్ – శంకర్ మళ్ళీ కలుస్తున్నారు ఈసారి అదిరిపోయే కమర్షియల్ ప్లాన్!

గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’  చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం ఆమె పేరు వినిపిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఒకవేళ ఆలియా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాకు పాన్-ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ రావడం ఖాయం. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని అందుకే ఆలియా వంటి టాలెంటెడ్ నటిని ఎంచుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రశాంత్ నీల్ కథకి అలియా ఆల్మోస్ట్ ఒకే చేసిందని త్వరలోనే దీనిపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.