Reading Time: 2 minutes
Jowar Dibbrotte Recipe Crispy Outside Soft Inside Traditional Breakfast

Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే సంప్రదాయ వంటకాలలో ‘దిబ్బరొట్టె’ ఒక ప్రత్యేకమైన వంటకం. మరి అలంటి వంటకం పోషకాలు సమృద్ధిగా ఉండే జొన్నతో తయారైతే ఎలా ఉంటుందో చెప్పండి. అవును ఈ జొన్నతో చేసిన దిబ్బ రొట్టె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మధుమేహం (షుగర్) ఉన్నవారు కూడా దీన్ని ఎలాంటి సందేహం లేకుండా తునవచు. సులభమైన పదార్థాలతో ఇంట్లోనే తయారుచేసుకునే ఈ వంటకం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మరి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం.

MS Dhoni Ruled Out IPL: బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 మ్యాచ్ లకు మిస్టర్ కూల్ ‘ధోని’ దూరం..!

కావలసిన పదార్థాలు:
* మినపప్పు – 1 కప్పు
* జొన్న రవ్వ – 3 కప్పులు (మినపప్పుకు మూడు రెట్లు)
* నీళ్లు – తగినంత
* ఉప్పు – రుచికి సరిపడా
* నూనె – రొట్టె కాల్చడానికి

తయారీ విధానం:
పిండి తయారీ:
ఒక గిన్నెలో మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 4–5 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే విధంగా జొన్న రవ్వను కూడా మరో గిన్నెలో తీసుకుని 2 లేదా 3 సార్లు కడిగి 4–5 గంటలు నానబెట్టాలి. నానిన మినపప్పును గ్రైండర్‌లో వేసి, కొద్దిగా చల్లటి నీళ్లు పోస్తూ మెత్తగా వెన్నలా రుబ్బుకోవాలి.

రవ్వ కలపడం:
రుబ్బిన మినపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, నానిన జొన్న రవ్వలోని నీటిని పూర్తిగా పిండేసి అందులో కలపాలి. రవ్వలో నీరు ఉండకూడదు, లేదంటే పిండి పల్చగా అయిపోతుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూతపెట్టి రాత్రంతా లేదా సుమారు 8 గంటలు పులియనివ్వాలి.

స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

రొట్టె వేయడం:
పులిసిన పిండిలో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. స్టవ్‌ పై మందపాటి పెన్నం పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కాక పిండిని దిబ్బరొట్టెలా మందంగా పోయాలి. ఇలా వేసిన దానిని మధ్యస్థ మంటపై రొట్టెను చుట్టూ సమానంగా కాలేలా పెనాన్ని కదుపుతూ కాల్చాలి. ఒక వైపు బాగా ఎర్రగా కాలిన తర్వాత మరో వైపు తిప్పి 2–3 నిమిషాలు కాల్చాలి. అంతే ఆరోగ్యమైన ‘జొన్న దిబ్బరొట్టె’ రెడీ.