
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) నగరవాసులకు కీలక సూచన చేసింది. ఎర్త్ అవర్ 2026లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు లైట్లు ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది. #GiveAnHourForEarth నినాదంతో నిర్వహించే ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. పచ్చదనం పెంపు, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లక్ష్యాల సాధనలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు కీలకమని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. వాతావరణ మార్పులకు ప్రతిస్పందించే నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నగర ప్రజలు, సంస్థలు, విద్యాసంస్థలు చురుకుగా పాల్గొని పర్యావరణ హిత కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని అధికారులు కోరారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.
READ MORE: Aloo Roti Recipe: ఆలూ రోటీ ఇలా ప్రయత్నించండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తింటారు..