Reading Time: < 1 minute
Ap Cabinet Approves Resolution To Grant Legal Status To Amaravati As Capital

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం 2014లోని సెక్షన్-5ను స‌వ‌రించాల్సిందిగా తీర్మానం చేసింది. కొత్త రాజ‌ధానిగా సీఆర్డీఏ పరిధిలోని అమ‌రావ‌తి పేరును చేర్చాలని ప్రతిపాదించింది. ఎల్లుండి (28-03-2026) ఏపీ అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చ చేపట్టి తీర్మానించాలని డిసైడ్ అయింది. అనంతరం కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే రాజధాని అమరావతిగా ఆమోదం లభించే అవకాశం ఉంది.

Ch

చంద్రబాబు..
రాజధాని అమరావతి చరిత్ర ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతి రాజధానిగా సమర్థించిన జనగ్.. గతంలో 3 రాజధానుల నాటకాన్ని ప్రజలకు గుర్తుచేయాలని సూచించారు. 3 రాజధానుల నాటకంలో నాడు మండలి చైర్మన్‌గా ఉన్న షరీఫ్‌పై దాడి జరిగినంత పనైందని గుర్తుచేశారు.

ఇక రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థపై కూడా కేబినెట్‌లో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జగజ్జీవన్ రామ్ జయంతి రోజు(ఏప్రిల్ 5) మొదలుకుని అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) లోపు ప్రతి నియోజకవర్గంలో 2 వేలు చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పీఎం కుసుమ్ ద్వారా పవర్ లాస్‌లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు 33/11కేవీ సబ్ స్టేషన్‌ల దగ్గర ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ శాఖ ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. నేవీ చీఫ్ అలిరెజా హతం