July 11, 2026

రామప్పను సందర్శించిన  నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అధికారులు

రామప్పను సందర్శించిన  నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అధికారులు
Reading Time: < 1 minute

రామప్పను సందర్శించిన  నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అధికారులు

Caption of Image.

 వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను   న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ పై శిక్షణ ఇచ్చే అధికారులు సచిన్ బాద్షా,తరుణ్ గుప్తా, ఇవాన్ అలెగ్జాండర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్​ శర్మ, ఉమాశంకర్ వారికి   స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఈవో ఇమ్మడి భాస్కర్ శాలువాలతో సత్కరించారు. 

 టూరిజం గైడ్  విజయ్ ద్వారా   రామప్ప చరిత్ర, శిల్పకళా నైపుణ్యాన్ని తెలుసుకున్నారు. ఆలయ చరిత్ర శిల్పకళ విశిష్టతను టూరిజం గైడ్ గోరంతల విజయ్ కుమార్  వివరించారు. ఈ కార్యక్రమంలో  వారి వెంట తూర్పు కోఆర్డినేటర్ సందీప్, తహసిల్దార్​గిరిబాబు, ఎస్సై చల్ల రాజు, ఏఎస్ఐ సాంబారావు, ఆర్ఐ రమేశ్​,  టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్ బద్రు, పురావస్తు,  దేవాదాయ, టూరిజం, పోలీస్ రెవెన్యూశాఖల సిబ్బంది ఉన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.