July 12, 2026

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
Reading Time: 2 minutes
Dulquer Salmaans Srisri First Look Out Dq41 Title Revealed Pooja Hegde Joins Romantic Entertainer

Dulquer Salmaan: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 41వ చిత్రం ఎట్టకేలకు అధికారికంగా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. పూజా హెగ్డేతో తొలిసారి జతకట్టిన దుల్కర్, ఈసారి ఎలాంటి ప్రేమకథను ప్రేక్షకులకు అందించబోతున్నాడు? పోస్టర్‌లో కనిపిస్తున్న ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వెనుక కథ ఏమిటి? అనే ఆసక్తి ఇప్పటికే సినీ అభిమానుల్లో మొదలైంది. ఇప్పటివరకు #DQ41 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘శ్రీశ్రీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రవి నెలకుడితి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమ కథతో ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడటానికి మరో ప్రధాన కారణం దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారి కలిసి నటించడం. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్, మరోవైపు తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ జంటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌కే మంచి స్పందన రాగా, ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచింది.

చిత్రానికి ‘Love Will Spark Again’ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఇద్దరూ ఒక కాంపౌండ్ గోడపై కూర్చొని నవ్వుకుంటూ కనిపిస్తున్నారు. దుల్కర్ లైట్ బ్లూ షర్ట్, గ్రే ట్రౌజర్స్, కళ్లద్దాలతో ఎంతో క్లాసిక్ లుక్‌లో కనిపించగా, పూజా హెగ్డే లైట్ బ్లూ సల్వార్ సూట్‌లో కనిపించారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎంతో ప్రశాంతంగా రూపొందించిన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో పాజిటివ్ ఫీలింగ్‌ను కలిగిస్తోంది. టెక్నికల్ గా కూడా ఈ చిత్రానికి అనుభవం ఉన్న టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని అనయ్ ఓం గోస్వామి అందిస్తుండగా, సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను అవినాష్ కొల్లా నిర్వహిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ‘శ్రీశ్రీ’ ప్రేమకథల్ని ఇష్టపడే ప్రేక్షకులకు మరో మధురమైన అనుభూతిని అందిస్తుందనే నమ్మకాన్ని తొలి పోస్టర్‌నే కలిగిస్తోంది.