Reading Time: < 1 minute
Srh Big Shock Jack Edwards Out Ipl 2026 Pat Cummins Injury Update

SRH IPL 2026: ఐపీఎల్‌కు ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్ తగిలింది. విదేశీ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు తన కెరీర్‌లో కేవలం ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడినప్పటికీ.. హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి, కెప్టెన్ పాట్ కమిన్స్‌లను ఆకట్టుకున్నాడు. ఫలితంగా, వేలంలో హైదరాబాద్ అతడిని 3 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే.. గాయం కారణంగా జాక్ ఈ సీజన్ మొత్తం దూరం కావాల్సి వచ్చింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ శిబిరంలో గాయపడిన రెండవ క్రికెటర్‌గా ఎడ్వర్డ్స్ నిలిచాడు. కెప్టెన్ కమిన్స్ ఇప్పుడిప్పుడే వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్నాడు. ఈ సీజన్‌లోని మొదటి కొన్ని మ్యాచ్‌లకు కమిన్స్ దూరంగా ఉండనున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహించనుండగా, అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

READ MORE: UstaadBhagatSingh‍ : ధురంధర్ – 2కు జై.. ఉస్తాద్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్.. ఫ్యాన్స్ ఫైర్

ఇదిలా ఉండగా.. మార్చి 19న ముగ్గురు క్రికెటర్లు ఈ సీజన్ నుంచి వైదొలిగారు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నాథన్ ఎల్లిస్, రాజస్థాన్ రాయల్స్ నుంచి సామ్ కర్రన్ ఉన్నారు. పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన లాకీ ఫెర్గూసన్ సైతం కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్‌కు దురమయ్యాడు. పోటీ నుంచి ఎల్లిస్ నిష్క్రమణను సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇప్పటికే ధృవీకరించారు. అతని స్థానంలో మరొకరి కోసం ఫ్రాంచైజీ ప్రస్తుతం అన్వేషిస్తోందని పేర్కొన్నారు. ఒట్టోనీల్ బార్ట్‌మన్‌ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతడిని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, హైదరాబాద్, రాజస్థాన్ ప్రస్తుతం ఒక విదేశీ ఆల్-రౌండర్ కోసం అన్వేషిస్తున్నాయి. హైదరాబాద్ ఓ విదేశీ పేసర్‌ను తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.

READ MORE: Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులు.. దక్కించుకున్నది ఎవరో తెలుసా?