July 12, 2026

హైదరాబాద్ మోతీ నగర్లో పగిలిన మంచినీటి ట్రాన్స్‌మిషన్ లైన్.. నీళ్లు వచ్చుడు కష్టమే !

హైదరాబాద్ మోతీ నగర్లో పగిలిన మంచినీటి ట్రాన్స్‌మిషన్ లైన్.. నీళ్లు వచ్చుడు కష్టమే !
Reading Time: < 1 minute

హైదరాబాద్ మోతీ నగర్లో పగిలిన మంచినీటి ట్రాన్స్‌మిషన్ లైన్.. నీళ్లు వచ్చుడు కష్టమే !

Caption of Image.

హైదరాబాద్: మోతీనగర్ రైల్వే ట్రాక్ సమీపంలో మంచినీటి ట్రాన్స్‌మిషన్ లైన్ పగిలిపోవడంతో నీరు ఒక్కసారిగా భారీగా లీకైంది. జలమండలి సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మోతీనగర్తో పాటు నీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.  వాటర్ బోర్డు సిబ్బంది మరమ్మతు పనులు ప్రారంభించారు. లీకేజీని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరం దక్కన్ ఏరియా కావడం వల్ల నీటి వనరులు తక్కువగానే ఉన్నాయి. మన దగ్గర హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డిలో సింగూరు, మంజీరా, నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్, పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి పైప్ లైన్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.