July 11, 2026

KKR Team: అయ్యో కేకేఆర్కు వరుస ఎదురుదెబ్బలు.. రూ. 18 కోట్లు పెట్టిన ఫలితం శూన్యం!

KKR Team: అయ్యో కేకేఆర్కు వరుస ఎదురుదెబ్బలు.. రూ. 18 కోట్లు పెట్టిన ఫలితం శూన్యం!
Reading Time: < 1 minute

KKR Team: అయ్యో కేకేఆర్కు వరుస ఎదురుదెబ్బలు.. రూ. 18 కోట్లు పెట్టిన ఫలితం శూన్యం!

Caption of Image.

KKR Team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి వరుస షాక్స్ తగిలాయి. భారత్–- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలతో ఢాకా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని కేకేఆర్ జట్టు నుంచి తప్పించింది. ఇక టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. పేస్ దళాన్ని పటిష్టం చేసే క్రమంలో శ్రీలంక బౌలర్ మతీశ పతిరణని తుది జట్టులోకి తీసుకుంటే ఇప్పుడు ఆడటంపై కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో గాయపడిన పతిరణ.. టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఇటీవలే అతడు ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తుంది. కానీ శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం ఐపీఎల్లో ఆడేందుకు మతీశకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నట్లు సమాచారం. పతిరణ ఫిట్నెస్ పై తమకు సంతృప్తికరమైన సమాచారం వచ్చినపుడే NOC ఇవ్వాలని చూస్తున్నట్లు లంక బోర్డు భావిస్తుంది. ఈ విషయంపై కేకేఆర్ SLC బోర్డుతో పతిరణ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడనే అంశంపై చర్చిస్తుంది. 

శ్రీలంక క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు చేస్తున్నాం.. ప్రతి రోజు పతిరణ కోసం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం, రద్దు చేయడం జరుగుతోందని కేకేఆర్ యాజమాన్యం పేర్కొనింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2022లో ఐపీఎల్లోకి వచ్చిన అతడు.. మహేంద్ర సింగ్ ధోని ప్రియ శిష్యుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మతీశ పతిరణ.. 47 వికెట్లు పడగొట్టాడు. 2026 వేలానికి ముందు చెన్నై అతడిని విడిచి పెట్టగా.. కేకేఆర్ రూ. 18 కోట్లకు దక్కించుకుంది. ఓవైపు హర్షిత్ రాణా జట్టుకు దూరమవడం.. పతిరణ విషయంలోనూ సస్పెన్స్ కేకేఆర్ కి పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు, పతిరణ మేనేజర్ మాత్రం త్వరలోనే అతడు అందుబాటులోకి వస్తాడనేలా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.  
 

©️ VIL Media Pvt Ltd.