Reading Time: < 1 minute

IIT JAM 2026: ఐఐటీజాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు విడుదల

Caption of Image.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నిర్వహించిన మాస్టర్స్ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ (JAM) 2026 ఫలితాలను గురువారం (మార్చి19) విడుదల చేశారు. IIT JAM పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ jam2026.iitb.ac.in లో చూసుకోవచ్చు. ఈ పరీక్షను ఫిబ్రవరి 15న నిర్వహించారు. స్కోర్‌కార్డ్ PDFను ఈ క్రింది విధంగా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

మొదట అధికారిక వెబ్‌సైట్ jam2026.iitb.ac.in ను సందర్శించి  అక్కడ కనిపించే  JAM Scorecard PDF’ లింక్‌పై క్లిక్ చేయాలి.  మీ ఎన్‌రోల్‌మెంట్/ఈమెయిల్ ఐడి , JOAPS పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేస్తే  JAM స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.  స్కోర్‌కార్డ్ PDF ను సేవ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి. 

►ALSO READ | టెన్త్ అర్హతతో ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు..

©️ VIL Media Pvt Ltd.