July 11, 2026

 Sanju Samson: చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్!

 Sanju Samson: చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్!
Reading Time: 2 minutes

 Sanju Samson: చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్!

Caption of Image.

Sanju Samson: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నాయకత్వ బాధ్యతలు మారే అవకాశం ఉందని మాజీ భారత క్రికెటర్ అనిల్ కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి ట్రేడ్ డీల్‌లో భాగంగా సీఎస్‌కేలోకి సంజు శాంసన్‌ వచ్చాడు. అతడి రాకతో సీఎస్‌కే జట్టు నిర్మాణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అతనిని నేరుగా లీడర్‌షిప్ గ్రూప్‌లో చేర్చే అవకాశం ఉందని కుంబ్లే పేర్కొన్నారు. జియో హాట్‌స్టార్‌లో ప్రసారమైన “గేమ్ ప్లాన్ – నో యువర్ టీమ్” కార్యక్రమంలో కుంబ్లే మాట్లాడుతూ.. సంజుకు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయం అన్నారు. ఆ పాత్రకి సరైన న్యాయం చేస్తాడని చెప్పారు. రాజస్థాన్ జట్టుకు అతను చాలా కాలం కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందుకే నాయకత్వ బాధ్యతలు అతనికి కొత్తేమి కాదని అనిల్ కుంబ్లే అన్నారు.

సంజు శాంసన్ ఇప్పటికే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఎన్నో సీజన్ల పాటు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు డిప్యూటీగా, అలాగే ఎంఎస్ ధోనీ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుందని అనిల్ కుంబ్లే వెల్లడించారు. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో గైక్వాడ్ గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. దీంతో జట్టు నాయకత్వ బాధ్యతలు మళ్లీ ధోనీకి అప్పగించాల్సి వచ్చింది. ఆ సీజన్‌లో సీఎస్‌కే చరిత్రలో తొలిసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కానీ ఈసారి ఐపీఎల్ 2026లో బలంగా పునరాగమనం చేయాలని సీఎస్‌కే లక్ష్యంగా పెట్టుకుంది. ఆరో టైటిల్ గెలవాలనే ఆశయంతో జట్టు సన్నద్ధమవుతోందన్నారు.

సీఎస్కే స్క్వాడ్ 2026:
* బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), దేవాల్డ్ బ్రేవిస్, అయుష్ మత్రే, కార్తిక్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్)
* ఆల్‌రౌండర్లు: అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, మ్యాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, శివం దూబే
* బౌలర్లు: ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, గుర్జప్నీత్ సింగ్, అకీల్ హోసైన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చాహర్

 

 

©️ VIL Media Pvt Ltd.