
ఉ.8 నుంచి మ.12:30 వరకు తరగతులు
టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లకు
పరీక్షలు జరిగే రోజుల్లో
మ.1 గంట నుంచి సా. 5 వరకు క్లాసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం ఒంటిపూట బడులు (హాఫ్‌డే స్కూల్స్) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. తరగతులు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. అయితే, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. అలాగే, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ కేంద్రాలు కూడా 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.