July 11, 2026

Strait of hormuz: “భారత్ మా మిత్రుడు”.. హార్ముజ్‌లో మన నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.!

Strait of hormuz: “భారత్ మా మిత్రుడు”.. హార్ముజ్‌లో మన నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.!
Reading Time: < 1 minute
Iran Grants Safe Passage Indian Ships Strait Of Hormuz Friendship

Iran War: పర్షియన్ గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు సానుకూల వార్త వెలువడింది. భారత్‌లోని ఇరాన్ రాయబారిక మొహమ్మద్ ఫతాలి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధి ద్వారా భారతదేశానికి సురక్షితమైన ప్రయాణాన్ని మంజూరు చేయవచ్చని సంకేతాలిచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం ఇరాన్‌కు మిత్రదేశం’’ అని ఆయన అన్నారు. హార్ముజ్ ద్వారా భారత నౌకల రవాణాకు సంబంధించి సానుకూల తీర్మానం అతి త్వరలో రావచ్చని ఆయన చెప్పారు.

Read Also: Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?

భారతదేశానికి హార్ముజ్ ద్వారా సురక్షితమైన ప్రయాణానికి అనుమతిస్తారా.. ? అని మీడియా ప్రశ్నించిప్పుడు, ఫతాలి మాట్లాడుతూ… ‘‘అవును ఎందుకంటే భారతదేశం మా స్నేహితుడు. మీరు రెండు లేదా మూడు గంటల్లో ఫలితాన్ని చూస్తారు’’ అని అన్నారు. భారత్, ఇరాన్ ప్రాంతీయ స్థాయిలో అనేక సాధారణ ప్రయోజనాలను పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. భారత్ క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచిందని ఇరాన్ రాయబారి చెప్పారు. భారత్ బహుళ రంగాల్లో తమకు మద్దతు అందించిందని చెప్పారు. యుద్ధం తర్వాత భారత్ తమకు ఎలా సహకరించిందో చెబుతానని అన్నారు.

ఇజ్రాయిల్, యూఎస్ -ఇరాన్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభం ఏర్పడింది. ఇరాన్ గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘ హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో భారత్, చైనా, ఆగ్నేయాసియా దేశాల ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. అయితే, భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక చమురు ఉత్పత్తి దేశాలపై ఆధారపడటంతో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.