Reading Time: < 1 minute

హైదరాబాద్: దురంధర్ 2: ది రివెంజ్ సినిమా ట్రైలర్ మార్చి 7న విడుదలైంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ అనే హీరో జస్కిరత్ సింగ్ రంగి పాత్రలో అద్భుతంగా నటించాడు. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భారత్‌లో కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత దేశ పర్యటనకు వచ్చారు. భారత్-ఫిన్లాండ్ మధ్య దౌత్య సంబంధాలు రక్షణ ఒప్పందాలుపై చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి అందరూ అనుకుంటారు కానీ అలెగ్జాండర్ మాత్రం ధురంధర్ సినిమాపై మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ధురంధర్2 సినిమా వీక్షించడానికి చాలా ఉత్సహంతో ఉన్నానని చెప్పాడు. ఇండియాకు రాకముందు తన కుమారుడు ధురంధర్ సినిమా చూడాలని కోరడంతో సినిమాను వీక్షించాని తెలియజేశాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. మార్చి 19న ధురంధర్ 2 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చూస్తానని చెప్పారు.