Reading Time: < 1 minute
Israel Is Searching In Lebanons Graveyard Behind This Is The Sacrifice Of A Pilot

Israel: ఇజ్రాయిల్ ఓ వైపు ఇరాన్‌తో మరోవైపు దాని ప్రాక్సీలైన హిజ్బుల్లాపై దాడులు చేస్తోంది. హిజ్బుల్లాను అంతం చేయడానికి లెబనార్‌పై విరుచుకుపడుతోంది. అయితే, తూర్పు లెబనాన్‌లో రాత్రిపూట ‘‘శ్మశాన వాటిక’’ను దున్నేయడం చర్చనీయాంశంగా మారింది. 4 దశాబ్ధాల క్రితం మిస్సైన పైలట్ అవశేషాల కోసం ఇజ్రాయిల్ ప్రత్యేక దళాలు ఒక గ్రామంలోని శ్మశాన వాటికలో విస్తృతంగా సెర్చ్ చేస్తోంది.

1986లో జరిగిన ఘర్షణల సమయంలో యుద్ధవిమానం కూలిపోయిన తర్వాత ఇజ్రాయిల్ వైమానిక దళ నావిగేటర్ రాన్ ఆరాద్ అదృశ్యమయ్యారు. అతడి మృతదేహాన్ని తిరిగి పొందడం కోసం ఇజ్రాయిల్ ఇదంతా చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ నిర్వహిస్తు్న్న ఈ ఆపరేషన్‌లో ఎలాంటి ప్రాణనష్టం కలగలేదని చెప్పింది. ఆరాద్ అవశేషాలు దొరకలేదని ఇజ్రాయిల్ అధికారులు చెప్పారు. అయితే, ఇది కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు. బెక్కా వ్యాలీ శ్మశాన వాటికలో సెర్చ్ ఆపరేషన్ కోసం హెలికాప్టర్‌లో వచ్చిన ఇజ్రాయిల్ కమాండోలు అర్థరాత్రి శ్మశానవాటికలో తనిఖీ చేశారు.

1986లో ఘర్షణలో అరాద్ అదృశ్యం:

1986లో ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య ఘర్షణల సమయంలో లెబనాన్ మీదుగా ఇజ్రాయిల్ విమానం కూలిపోయింది. ఆ సంఘటన తర్వాత నేవిగేటర్ రాన్ ఆరాద్ మిస్సయ్యారు. బెకా లోయలో ఎక్కడో చోట ప్రమాదం జరిగిన తర్వాత ఆరాద్ మరణించారని, స్థానికంగా ఖననం చేసినట్లు ఇజ్రాయిల్ భావిస్తోంది. 40 ఏళ్లుగా పైలట్ మృతదేహం కోసం ఇజ్రాయిల్ వెతుకుతోంది.

ఆరాద్ గురించి తెలుసుకోవడానికి ఈ దాడి జరిగినట్లు ఇజ్రాయిల్ అధికారులు ధ్రువీకరించారు. అవశేషాలను నబిషిత్ ప్రాంతంలో ఖననం చేయవచ్చని సూచించే నిఘా సమాచారాన్ని పరిశోధించే ప్రయత్నంగా అధికారులు ఈ మిషన్‌ను అభివర్ణించారు. తాజాగా జరిగిన ఆపరేషన్ సమయంలో లెబనీస్ సైన్యం, హిజ్బుల్లా నుంచి ప్రతిఘటన ఎదురైందని, ఆ తర్వాత అక్కడి నుంచి ఇజ్రాయిల్ బలగాలు ఉపసంహరించుకున్నాయని స్థానిక నివేదికలు చెబుతున్నాయి.

దశాబ్ధాలుగా ఆరాద్ కోసం అన్వేషణ:

రాన్ ఆరాద్ కోసం దశాబ్ధాలుగా అన్వేషిస్తోంది. మొస్సాద్, ఇతర ఇజ్రాయిలీ ఏజెన్సీలు లెబనాన్‌ను జల్లెడ పడుతున్నాయి. ఓవైపు ఇరాన్ వార్, మరోవైపు హిజ్బుల్లా దాడుల ఇలా ఇజ్రాయిల్ బిజీగా ఉన్నా కూడా తమ పైలట్ అవశేషాల కోసం వెతుకుతూనే ఉంది.