Reading Time: < 1 minute

హైదరాబాద్: బీర్ బాటిల్‌లో చేపపిల్ల కనిపించిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  మ‌ల్లాపూర్ సమీపంలోని ఓ వైన్స్‌లో మందుబాబు కేఎఫ్ బీర్ కొనుగోలు చేశాడు. ఓపెన్ చేసే సమయంలో చేప పిల్లను చూసి మందుబాబు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో బీర బాటిల్ లో బొద్దింక, పురుగులు కనిపించిన సంఘటనలు తెలిసినవే. బీర్ బాటిల్ లోకి చేప పిల్ల ఎలా వచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.