భారతీయ సినిమా రంగంలో మహిళా ప్రాధాన్య చిత్రాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీనికి ఉత్తమ ఉదాహరణ ఎనిమిది సంవత్సరాల క్రితం విడుదలైన ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ చిత్రం. స్టార్ హీరోయిన్లు లేకపోయినప్పటికీ ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ. 905 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది. 17 ఏళ్ల జైరా వాసిమ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించి, ఈ కథ గురించి మాట్లాడుకుంటున్నారు.
పితృస్వామ్య సమాజంలో చిక్కుకున్న ఒక యువతి, తన మోసపూరిత తండ్రి , భర్త నుండి విముక్తి పొందడానికి చేసే పోరాటాన్ని చిత్రీకరించిన ఈ చిత్రం, భారతదేశంలోనే కాకుండా చైనాతో సహా అనేక దేశాలలో కూడా భారీ విజయం సాధించింది. 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, భారతదేశంలో 65 కోట్ల రూపాయలు, చైనాలో 750 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక్క హాంకాంగ్ నుంచే ఇది 65 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’ వంటి రెండు హిట్ చిత్రాలలో నటించిన జైరా వాసిం, 18 ఏళ్ల వయసులో నటనకు స్వస్తి పలికారు. నటన తన మత విశ్వాసాలకు విరుద్ధమని చెబుతూ ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘ది స్కై ఈజ్ పింక్’ ఆమె చివరి చిత్రం. 2017లో విడుదలై అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ సినిమాలో జైరా వసీమ్ కథానాయికగా ప్రధాన పాత్ర పోషించగా, బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఒక వైవిధ్యమైన సంగీత దర్శకుడి (శక్తి కుమార్) పాత్రలో కనిపించారు.
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ , జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణ వ్యయం (బడ్జెట్) కేవలం రూ. 15 కోట్లు మాత్రమే. భారతదేశంలో విడుదలైన సమయంలోనే ప్రశంసలతో పాటు మంచి లాభాలను తెచ్చిపెట్టిన ఈ చిత్రం, ఆ తర్వాత చైనా బాక్సాఫీస్ వద్ద ఊహించని సునామీ సృష్టించింది. చైనా ప్రేక్షకులు ఈ చిత్రంలోని మాతృప్రేమ, మహిళా సాధికారత, భావోద్వేగాలకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. దాంతో ఒక్క చైనాలోనే ఈ సినిమా రూ. 750 కోట్లకు పైగా రాబట్టింది.
చివరికి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ చిత్రం రూ. 900 కోట్లకు పైగా (సుమారు రూ. 960 కోట్లు) గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. అంతేకాకుండా, ఒక మహిళా ప్రధాన పాత్రతో తెరకెక్కి ప్రపంచ స్థాయిలో ఈ స్థాయి బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పిన తొలి భారతీయ చిత్రంగా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.




