Reading Time: < 1 minute

కుటుంబకలహాలతో.. భార్యను కత్తితో పొడిచిన భర్త

Caption of Image.

కరీంనగర్ జిల్లా దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యపైభర్త కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం (ఆగస్టు2) తెల్లవారుజామున హుజూరాబాద్ మండలం రాంపూర్ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్  మండలం రాంపూర్ కు చెందిన సతీష్  శ్యామల భార్యభర్తలు. మొదట అరుణఅనే మహిళన పెళ్లిచేసుకున్న సతీష్.. ఆమె చెల్లెలు శ్యామలను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.. వృత్తిరీత్యా టైలర్ అయిన సతీష్  శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య శ్యామలతో వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం కాస్త ముదిరి తెల్లవారు జామును భార్య శ్యామలపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో  ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు  చికిత్స కోసం శ్యామలను హుజూరాబాద్  ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో తరుచు భార్యభర్తలు ఇద్దరు  గొడవపడుతున్నట్టు తెలుస్తోంది. మద్యం తాగేందుకు కూలీ డబ్బులు అడగగా శ్యామల నిరాకరించిందని దీంతో సతీష్ మద్యం మత్తులో ఆమెపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.